For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Adani: సరికొత్త రికార్డ్ సృష్టించిన గౌతమ్ అదానీ.. ప్రపంచంలో రెండో కుబేరుడిగా రికార్డ్.. భారత తొలి వ్యక్తిగా..

|

Gautam Adani: భారత పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్‌పర్సన్ గౌతమ్ అదానీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. భారత్ నుంచి ఈ ఘటన సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఆసియాలో ఈ ఫీటీ సొంతం చేసుకున్న మెుదటి వ్యక్తి కూడా గౌతమ్ అదానీ కావటం విశేషం.

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం సెప్టెంబర్ 16, 2022 అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో వ్యక్తిగా నిలిచారు.

నెల తిరగకుండానే..

నెల తిరగకుండానే..

గత నెల 30నే ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ నాలుగో స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకారు. కనీసం నెల రోజులు కూడా కాకముందే తాజాగా రెండో స్థానాన్ని కైవసం చేసుకుని ప్రపంచం మెుత్తాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం ఆయన సంపద నికర విలువ 155.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కాలంలో 5.5 బిలియన్ డాలర్లు పెరిగింది.

జెఫ్ బెజోస్‌ను నెనక్కు నెట్టి..

జెఫ్ బెజోస్‌ను నెనక్కు నెట్టి..

అంతర్జాతీయంగా మార్కెట్లు అతలాకుతలం అవుతున్నప్పటికీ అదానీ కంపెనీల షేర్లలో మాత్రం ర్యాలీ కొనసాగటంతో ఈ రికార్డు సొంతమైంది. దీంతో ఆయన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను వెనక్కు నెట్టి రెండవ అత్యంత సంపన్న స్థానాన్ని పొందారు. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ సంపద తగ్గిపోవటంతో ఆయన నికర విలువ ప్రస్తుతం 273.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

అదరగొట్టిన అదానీ స్టాక్స్..

అదరగొట్టిన అదానీ స్టాక్స్..

అదానీ గ్రూప్ స్టాక్స్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్, అదానీ ట్రాన్స్‌మిషన్ ఈరోజు ప్రారంభ డీల్స్‌లో మార్కెట్లో తమ రికార్డు గరిష్ఠాలను తాకాయి. దీని కారణంగా అదానీ ఆస్తుల విలువ అమాంతం పెరిగింది. 60 ఏళ్ల వయస్సులో అదానీ ఇలాంటి రికార్డు సాధించి అంబానీలకు మరింత గట్టి పోటీని ఇస్తున్నారు.

2022లో సంపద పెరుగుదల ఇలా..

2022లో సంపద పెరుగుదల ఇలా..

2022 ప్రారంభం నుంచి ఇప్పటి వరుకు అదానీ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ప్రపంచంలోని టాప్-10 బిలియనీర్లలో సంపద పెరిగింది కేవలం అదానీది మాత్రమే కావటం గమనార్హం. ఫిబ్రవరిలో ఆసియా ధనికుడిగా ముఖేష్ అంబానీని అదానీ అధిగమించారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను గత నెలలో వెనక్కు నెట్టారు.

అనేక వ్యాపారాలు..

అనేక వ్యాపారాలు..

అదానీ కొన్ని నెలలుగా అనేక కొత్త వ్యాపారాలను సొంతం చేసుకుంటూ వేగంగా ముందుకు సాగటం ఈ సంపద పెరుగుదలకు మరో కారణంగా నిలుస్తోంది. ప్రస్తుతం అదానీ గ్రూప్ దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, ఎయిర్ పోర్ట్స్, బొగ్గు వ్యాపారం, పవర్ ట్రాన్స్ మిషన్, పవర్ జనరేషన్, గ్రీన్ ఎనర్జీ, రిటైల్, సిమెంట్, రియల్ ఎస్టేట్, గ్యాస్ అండ్ ఎనర్జీ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తన 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక కారణాల కోసం 7.7 బిలియన్ డాలర్లను విరాళంగా అందించనున్నట్లు జూన్‌లో ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

English summary

Adani: సరికొత్త రికార్డ్ సృష్టించిన గౌతమ్ అదానీ.. ప్రపంచంలో రెండో కుబేరుడిగా రికార్డ్.. భారత తొలి వ్యక్తిగా.. | Gautam Adani became worlds second richest billionaire surpassing Jeff Bezos created new record

Gautam Adani became worlds second richest billionaire surpassing Jeff Bezos created new record
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X