Gautam Adani: అదానీ ఈజ్ బ్యాక్.. కోల్పోయిన స్థానం తిరిగొచ్చి.. కానీ..
Gautam Adani: ఎవరు ఏం చేసినా అదానీ గ్రూప్ మాత్రం తుఫాను నుంచి తీరానికి వచ్చిన ఓడలా ముందుకు సాగుతూనే ఉంది. దీనంతటినీ నడిపిస్తోంది ద బిలియనీర్ అదానీ గుజరాతీ బ్రెయిన్. తొళకని గుండె ధైర్యమే ఆయన అసలు పెట్టుబడని చెప్పుకోవాలి.
అదానీ ఆసియాలో రెండో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. శుక్రవారం మార్కెట్లు ముగిసే నాటికి అదానీ గ్రూప్ లోని చాలా కంపెనీల షేర్లు లాభాల బాట పట్టడంతో ఆవిరైన సంపద తిరిగి జోడింపబడింది. దీంతో ఆయన సంపద 969 మిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో మరోసారి చైనీస్ బిలియనీర్ జాంగ్ షన్షాన్‌ను అధిగమించి ఆసియాలో రెండవ ధనవంతుడిగా నిలిచారు. అలాగే ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్-21వ స్థానంలో కొనసాగుతున్నారు.

శుక్రవారం నాడు అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.27 శాతం, అదానీ పోర్ట్ 0.86 శాతం, అదానీ పవర్ 3.33 శాతం మేర మార్కెట్లో లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా రెండు శాతానికి పైగా పెరుగుదలతో ముగిసింది. అదానీ గ్రీన్ సొల్యూషన్ కూడా 1.56 శాతం.. ACC, అంబుజా సిమెంట్, NDTV కూడా గ్రీన్‌లో ప్రయాణాన్ని ముగించాయి. అయితే అదానీ పోర్ట్స్ మాత్రం రెడ్ మార్క్‌లో ఉంది. షేర్లలో ఈ పెరుగుదల కారణంగా అదానీ సంపద 62.8 బిలియన్ డాలర్లు పెరిగింది.
ఇంతకు ముందు బిలియనీర్ గౌతమ్ అదానీ ఒక్కరోజులో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. అదానీ గ్రూప్ తన సొంత షేర్లను రహస్యంగా కొనుగోలు చేయడం ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టినట్లు వచ్చిన ఆరోపణలు మార్కెట్లను కుదిపేశాయి. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగటంతో కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి.
ప్రస్తుతం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఎలాన్ మస్క్ 226 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉండగా.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానంలో 183 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నారు. అలాగే జెఫ్ బెజోస్ 162 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, 134 బిలియన్ డాలర్ల సంపదతో లారీ ఎల్లిసన్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇక బిల్ గేట్స్ ఆస్తులు 129 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో లారీ పేజ్, వారెన్ బఫెట్, సెర్గీ బ్రిన్, స్టీవ్ బాల్మెర్, మార్క్ జుకర్‌బర్ కొనసాగుతున్నారు. ఇక భారత బిలియనీర్ ముఖేష్ అంబానీ మాత్రం 91.2 బిలియన్ డాలర్లతో 12వ స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications