karan Adani: ఒకేసారి అనేక వ్యాపారాల్లోకి విస్తరిస్తున్న అదానీ కీలక బాధ్యతలను వారసులకు అప్పగిస్తున్నారు. ఇంతకు ముందు ముకేష్ అంబానీ సైతం తన వారసులకు ఇలాగే వ్యాపారాల బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవటానికి నవతరాన్ని దేశీయ వ్యాపారవేత్తలు రంగంలోకి దింపుతున్నారు. ప్రస్తుతం అదానీ సుమారు 11 కంపెనీల బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నారు.

సిమెంట్ వ్యాపారం..
స్విట్జర్లాండ్‌లోని బిల్డింగ్ మెటీరియల్స్ గ్రూప్ హోల్సిమ్ భారతీయ ఆస్తులు, అంబుజా సిమెంట్స్, ACC కొనుగోలు పూర్తయింది. దీంతో అదానీ బోర్డు పునర్వ్యవస్థీకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్ ఛైర్మన్‌గా ఉండగా.. పెద్ద కుమారుడు కరణ్ రెండు సిమెంట్ సంస్థల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. దీనికి తోడు ACC ఛైర్మన్‌గా కూడా కరణ్ కొత్త బాధ్యతలు అందుకున్నారు.

వ్యాపారంలో కరణ్ అదానీ..
తండ్రికి తగ్గ తనయుడిగా కనిపిస్తున్న కరణ్, ఒకేసారి గ్రూప్ లోని అనేక కంపెనీల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే 35 ఏళ్ల కరణ్ ఇప్పటికే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.

కొత్త పెట్టుబడులు..
సిమెంట్ వ్యాపారంలో అదానీ గ్రూప్ ఆ రంగంలో పోటీని తీవ్రతరం చేయనుంది. ప్రస్తుతం కంపెనీ బిజినెస్ అవసరాల కోసం వారెంట్ల కేటాయింపు ద్వారా రూ.20,001 కోట్ల వరకు సమీకరించనుంది. ఈ మెుత్తాన్ని వ్యాపార వృద్ధికోసం వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది.

కరణ్ పనితీరు ఇలా..
కరణ్ అదానీ రూ.15,934 కోట్లు విలువైన పోర్ట్ వ్యాపారంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఇది దేశంలోని దాదాపు నాలుగింట ఒక వంతు కార్గోను నిర్వహించే అతిపెద్ద వాణిజ్య నౌకాశ్రయం. అదానీ గ్రూప్ మొత్తం పోర్ట్ వ్యాపారం ఇప్పుడు పోర్ట్‌లు, లాజిస్టిక్స్, SEZలతో నిండిన కార్పొరేట్ రంగానికి సమీకృత ప్లేయర్‌గా ఉంది. కరణ్ జనవరి 2016లో CEOగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కంపెనీ ట్రాన్ఫమేషన్ భారీస్థాయిలో కొనసాగుతోంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవటంలో ఒక అడుగు ముందే ఉంటోంది.


Click it and Unblock the Notifications