Bloomberg Billioneres: ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరిగా కొంతకాలంపాటు గౌతమ్ అదానీ హవా కొనసాగింది. మూడు పువ్వులు ఆరు కాయల్లాగా సాగిన అదానీ గ్రూప్ వ్యాపారం.. హిండెన్‌బెర్గ్ నివేదికతో ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఏమాత్రం వెనకడుగు వేయకుండా తను కోల్పోయిన దానిని తిరిగి దక్కించుకునే వరకు అవిశ్రాంతంగా పనిచేశారు.
గౌతమ్ అదానీకి చెందిన పలు కంపెనీల షేర్లు కొన్ని రోజులుగా భారీ వృద్ధిని నమోదుచేశాయి. దీంతో ముఖేష్ అంబానీని సైతం ఓడించి ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైన తీర్పు రావడంతో షేర్ల ధరలు ఒక్కసారిగా పుంజుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాది జనవరిలో హిండెన్‌బెర్గ్ పరిశోధన నివేదికను విడుదల చేసినప్పుడు.. తన నికర విలువలో 34 శాతానికి పైగా సంపదను గౌతమ్ అదానీ కోల్పోయారు. అయితే మళ్లీ ఏడాది తిరిగే సరికి.. బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 12వ స్థానంలోకి వచ్చి చేరారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 13వ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా సంపదను పెంచుకున్న జాబితాలోనూ గౌతమ్ ఆదానీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. గతంలో ఈ టైటిల్ జిందాల్ స్టీల్‌కు చెందిన సావిత్రి జిందాల్ పేరిట ఉంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే అదానీ నికర విలువ 7.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. తద్వారా మొత్తం సంపద 13.3 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద నికర విలువను పొంది రికార్డు సృష్టించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications