Adani News: ఇండియన్ బిజినెస్ టైకూన్ అదానీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గౌతమ్ అదానీ కంపెనీ ఉత్తర్‌ప్రదేశ్ లో ప్లాంట్ నెలకొల్పటంతో కంపెనీ షేర్లలో కోలాహలం నెలకొంది.
కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజైన ఏప్రిల్ 1న స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సమయంలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ టోటల్ గ్యాస్ షేర్లపై ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. ట్రేడింగ్ సమయంలో షేర్ సుమారు 8 శాతం పెరుగుదలతో రూ.1,000 స్థాయికి చేరుకుంది. క్రితం ముగింపు సమయంలో ఒక్కో షేరు ధర కేవలం రూ.926.55గా ఉంది.

వాస్తవానికి అదానీ టోటల్ అనుబంధ సంస్థ అదానీ టోటల్ ఎనర్జీ బయోమాస్ లిమిటెడ్ (ATBL) మధుర జిల్లాలో ఉన్న బర్సానా బయోగ్యాస్ ప్లాంట్‌లో ఫేజ్-1 కార్యకలాపాలను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని బర్సానా బయోగ్యాస్ ప్రాజెక్ట్ మెుత్తం నిర్మాణ 3 దశలను కలిగి ఉంది. ఇది రోజుకు 600 టన్నుల ఫీడ్‌స్టాక్ సామర్థ్యాన్ని సాధిస్తుందని అదానీ టోటల్ గ్యాస్ తెలిపింది.
దీని ద్వారా 42 TPD కంప్రెస్డ్ బయో గ్యాస్, 217 TPD సేంద్రీయ ఎరువులు ఉత్పత్తి అవుతాయి. బర్సానా బయోగ్యాస్ ప్లాంట్ కోసం ప్రాజెక్ట్ మూడు దశల వ్యయం రూ.200 కోట్లకు పైగా ఉండనుంది. ఇది అదానీ టోటల్ ఎనర్జీ బయోమాస్ లిమిటెడ్ కంపెనీ మొదటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి సౌకర్యం.
కంపెనీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG) విభాగంలో, అదానీ టోటల్ గ్యాస్ గుజరాత్‌లోని దహేజ్‌లో తన మొదటి LNG రిటైల్ అవుట్‌లెట్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా దేశంలోని వ్యూహాత్మక ప్రదేశాల్లో ఎల్‌ఎన్‌జీ స్టేషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఔట్‌లెట్ జూలై 2024 నాటికి పనిచేస్తుందని భావిస్తున్నారు. ఇదే క్రమంలో EV విభాగంలో అదనంగా 1050+ EV ఛార్జింగ్ పాయింట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ క్రమంలో నగరాల సంఖ్య 20 నుంచి 130కి పెంచాలని కంపెనీ యోచిస్తోందని వెంచురా సెక్యూరిటీస్ పేర్కొంది.


Click it and Unblock the Notifications