గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్: నేటి నుంచి అమలు.. కొత్త ధరలు ఇవే..
కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి రోజు నేటి నుండి ప్రారంభమవుతుంది. అయితే ప్రతి నెల 1వ తేదీన అంటే ఈరోజు ఏప్రిల్ 1వ తేదీన ఇండియన్ ఆయిల్ (IOC), హిందూస్తాన్ పెట్రోలియం (HPCL) అండ్ భారత్ పెట్రోలియం (BPCL) వంటి పెట్రోలియం కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. దింతో దేశంలోని అతిపెద్ద పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ నుండి అందిన సమాచారం ప్రకారం ఇవాళ వాణిజ్య గ్యాస్ సిలిండర్ అంటే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలలో స్వల్ప తగ్గింపు నమోదైంది. దింతో సిలిండర్‌కు రూ. 41 తగ్గింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం, ఈరోజు అంటే ఏప్రిల్ 1 2025 నుండి 19 కిలోల LPG సిలిండర్ ధర రూ.1762కి చేరుకుంది. గతంలో, అంటే మార్చి నెలలో దీని ధర రూ.1803గా ఉంది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఈ సిలిండర్ ధర రూ.1797కి ఉండేది.
మహానగరాలలో కొత్త ధరలు ఎంతంతే : నేటి నుంచి కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1868.50కి చేరుకుంది. అంతకుముందు దాని ధర రూ. 1913 ఉండేది. అదేవిధంగా ముంబైలో వాణిజ్య LPG సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1713.50కి చేరుకుంది. గత మార్చిలో మాత్రం రూ.1755.50గా ఉంది. తమిళనాడులోని చెన్నైలో దీని ధర రూ.1921.50కి చేరింది, గత మార్చిలో దీని ధర రూ. 1965. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ.41 తగ్గి రూ.1762కి చేరింది. మార్చి 1న దీని ధర రూ.1803.
LPG సిలిండర్ పరిస్థితి ఏమిటి : సాధారణ ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ 14 కిలోలు ఉంటుంది. ఈరోజు ఇండియన్ ఆయిల్ సహా అన్ని పెట్రోలియం కంపెనీలు దేశీయ LPG సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ అంటే వంటింటి సిలిండర్ ధర రూ. 803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నైలో దీని ధర రూ. 818.50. ఢిల్లీలో ఏప్రిల్ 1, 2025 నాటికి 14 కిలోల సిలిండర్ ధర రూ.803 మాత్రమే .
హోటళ్లు, రెస్టారెంట్లకు రిలీఫ్ : స్థానిక పన్నులు, రవాణా ఖర్చులను బట్టి LPG ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ఈ ధరల సవరణ LPG సిలిండర్లను ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్ళు ఇంకా ఇతర వాణిజ్య సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే వాణిజ్య LPG సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడే చిన్న వ్యాపారాలకు కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications