For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ వంటగ్యాస్ ధరల పెంపు: కత్తినూరుతున్న ఆయిల్ కంపెనీలు: 1 నుంచి

|

న్యూఢిల్లీ: చమురు సంస్థలు మరోసారి వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమౌతున్నాయి. గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లను పెంచడానికి సన్నాహాలు చేస్తోన్నాయి. ఒక్కో వంటగ్యాస్ సిలిండర్‌‌పై కనీసం 50 రూపాయల వరకు అదనపు భారాన్ని మోపే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే ఆయిల్ అండ్ గ్యాస్ సరఫరా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శాంసంగ్ బిగ్‌షాక్: ఈ ఏడాదే 3 కోట్ల ఫోన్లు కట్స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శాంసంగ్ బిగ్‌షాక్: ఈ ఏడాదే 3 కోట్ల ఫోన్లు కట్

డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లు ఈ మధ్యకాలంలో భారీగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఒక్కో డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్‌పై 50 రూపాయల మేర భారాన్ని అదనంగా మోపాయి. కిందటి వారం కూడా స్వల్పంగా వాటి ధరలను సవరించాయి. రూ.3.50 పైసల మేర పెంచాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధానిలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1003 రూపాయలకు చేరింది. బెంగళూరులో 1,005 రూపాయలు పలుకుతోంది. చెన్నైలో రూ.1,018.50 పైసలు, కోల్‌కతలో 1,029 రూపాయలకు చేరింది.

 Gas companies to raise LPG rates again from June 1

గత సంవత్సరం చమురు సంస్థలు ఎల్పీజీ కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్లపై భారీగా భారాన్ని మోపిన విషయం తెలిసిందే. 205 రూపాయల వరకు ఒక్కో సిలిండర్‌పై భారం మోపాయి. అప్పట్లో గృహావసర వంటగ్యాస్ రేట్లను పెంచలేదు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల రేట్లను రెండుసార్లు పెంచాయి. ఫలితంగా దాదాపు అన్ని నగరాల్లోనూ కమర్షియల్ సిలిండర్లు 2,000 రూపాయలను దాటేశాయి.

డొమెస్టిక్ ఎల్పీజీ వంటగ్యాస్ కనెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం 200 రూపాయల చొప్పున సబ్సిడీని ప్రకటించినప్పటికీ.. అది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోందనే విషయం తెలిసిందే. దీపం పథకం కింద మంజూరయిన కనెక్షన్లకు మాత్రమే ఈ సబ్సిడీ లభిస్తోంది. సాధారణ గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలు మాత్రం యధాతథంగా కొనసాగుతున్నాయి. జూన్ 1న లేదా మధ్య నెలలో మరోసారి ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచడం ఖాయమంటూ వార్తలు వస్తోన్నాయి.

English summary

మళ్లీ వంటగ్యాస్ ధరల పెంపు: కత్తినూరుతున్న ఆయిల్ కంపెనీలు: 1 నుంచి | Gas companies to raise LPG rates again from June 1

The rising crude oil prices and inflation is likely to make gas companies to raise LPG rates again next month. Currently, the price of an LPG cylinder in Delhi is Rs 1003.
Story first published: Saturday, May 28, 2022, 16:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X