Garlic: ఇటీవల దేశంలో కురిసిన అకాల వర్షాలు పంటలను నాశనం చేశాయి. కొద్ది రోజుల కిందట ఉల్లి ధరలు ఘాటెక్కిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ జాబితాలోకి వెల్లుల్లి వచ్చి చేరింది. దీంతో మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం దేశంలో పెరుగుతుందనే భయాలు మెుదలయ్యాయి.
ఉల్లి తర్వాత ఇప్పుడు వెల్లుల్లి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చట్నీ రుచిలో అత్యంత కీలక పాత్ర పోషించే వెల్లుల్లి ధర కిలో రూ.400కి చేరింది. ఇకపై పెరిగిన ధరల భారంతో ఆహారం నుంచి వెల్లుల్లి కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజలు కూరగాయలతో పాటు మాంసాహార వంటకాల్లో ఎక్కువగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వినియోగిస్తుంటారు. కొత్త పంట మార్కెట్లకు రావటానికి సమయం పడుతున్నందున ప్రస్తుతం ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారాలు చెబుతున్నారు.

దీనికి తోడు అక్టోబర్-నవంబర్ నెలల్లో అకాల వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నాసిక్, పూణేలోని ప్రధాన ఉత్పత్తి ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మహారాష్ట్ర అంతటా పంట దిగుబడి తగ్గడంతో రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధరలు కిలో రూ.300-400కి చేరుకున్నాయి. దీంతో ముంబై హోల్‌సేల్ వ్యాపారులు పొరుగున ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి సరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు సైతం పెరుగుతున్నాయి.
తక్కువ సరఫరా కారణంగా గత కొన్ని వారాల్లో వెల్లుల్లి ధర దాదాపు రెండింతలు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. త్వరలో పరిస్థితి మెరుగుపడదని వారు అంచనా వేస్తున్నారు. ఏపీఎంసీ బల్క్ యార్డులో గత నెలలో కిలో రూ.100-150 నుంచి రూ.150-250కి పెరిగింది. ఈ మార్పు ఇప్పుడు చిల్లర ధర కిలో రూ.300 నుంచి రూ.400కి చేరింది.ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ కు రోజుకు 15-20 వాహనాల్లో మాత్రమే సరకు వస్తోందని ఇది సాధారణం కంటే 25-30 వాహనాలు తక్కువని వారు చెబుతున్నారు. ఊటీ, మలప్పురం నుంచి సరఫరా భారీగా తగ్గిందని ఏపీఎంసీ వ్యాపారులు తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications