Job cuts: కొత్త ఏడాదిలోనూ కొలువుల కోతలకు ఆయా కంపెనీలు క్యూ కట్టాయి. ఈ సంవత్సరమైనా మంచి ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూసే వారికి నిరాశ తప్పడం లేదు. కొత్తవాటి సంగతి తర్వాత ముందు ఉన్న కొలువులూ ఊడుతుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.
వీడియోగేమ్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ 'యూనిటీ సాఫ్ట్‌వేర్' తాజాగా లేఆఫ్స్ ప్రకటించింది. తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 25 శాతం మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. అంటే సుమారు 1,800 మందిని ఉద్యోగం నుంచి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్ మరియు అంతర్గత మెమోలో తెలిపింది.

సంస్థ ప్రకటన తర్వాత గంటల వ్యవధిలోనే యూనిటీ షేర్లు దాదాపు 5 శాతం పెరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ కంపెనీకి ఇప్పటివరకు ఇవే అతిపెద్ద తొలగింపులు. అయితే జూలై 2022 నుంచి చూస్తే కంపెనీలో ఇది నాల్గర రౌండ్ లేఆఫ్స్ కావడం గమనార్హం. మార్చి చివరి నాటికి ఉద్వాసన వ్యవహారం పూర్తవుతుందని సంస్థ వెల్లడించింది.
గేమింగ్ పరిశ్రమకు బయట యూనిటీ అంతగా పాపులర్ కానప్పటికీ.. ప్రతి నెలా 1.1 మిలియన్లకు పైగా గేమ్ డెవలపర్స్ దాని సాఫ్ట్‌వేర్ టూల్‌కిట్‌పై ఆధారపడతారు. ఇందులో పోకీమాన్ గో, బీట్ సాబెర్ మరియు హార్త్‌స్టోన్ వంటి గేమ్ తయారీదారులు కూడా ఉన్నారు. ఈ ఉద్యోగాల కోతలు అన్ని టీమ్స్, ప్రాంతాలతో పాటు బిజినెస్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications