డిజిటల్ పేమెంట్స్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు యూపీఐలో పెద్ద మొత్తం డబ్బు పంపడం కష్టమయ్యేది. ఒక్క రోజుకి గరిష్టంగా 1 లక్ష మాత్రమే పంపే లిమిట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందికి చెక్ పెట్టింది NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా).
సెప్టెంబర్ 15, 2025 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్‌కి యూపీఐ లిమిట్‌ను రోజుకు 10 లక్షల రూపాయల వరకు పెంచింది. అంటే ఇక పన్నులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, రుణాల EMIలు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ఇవన్నీ యూపీఐ ద్వారానే సులభంగా క్లియర్ చేసేయొచ్చు.

ఇంతకు ముందు ఉన్న ఇబ్బంది ఏమిటి?
ముందు యూపీఐలో రోజుకి గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు మాత్రమే పంపే అవకాశం ఉండేది. అందుకే పెద్ద మొత్తంలో పన్నులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన వాళ్లు NEFT, RTGS లాంటి ఇతర బ్యాంకింగ్ ఆప్షన్లపై ఆధారపడాల్సి వచ్చేది. ప్రత్యేకంగా ITR సీజన్‌లో అయితే యూపీఐతో పెద్ద మొత్తాలు చెల్లించడం అసాధ్యమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక్క ట్రాన్సాక్షన్‌కి 5 లక్షలు, రోజుకి మొత్తం 10 లక్షలు పంపే అవకాశం రావడంతో, పెద్ద మొత్తాలు కూడా యూపీఐ ద్వారానే సులభంగా చెల్లించొచ్చు. దీని వలన యూపీఐపై నమ్మకం, వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎవరికీ ఈ కొత్త లిమిట్ వర్తిస్తుంది?
ఈ కొత్త యూపీఐ లిమిట్ P2M (వ్యక్తి నుండి వ్యాపారి) లావాదేవీలకే వర్తిస్తుంది. అంటే మనం నేరుగా వ్యాపారాలు, సంస్థలు లేదా సర్వీస్ ప్రొవైడర్లకు చేసే చెల్లింపులు. ఉదాహరణకి ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించడం, బ్యాంకులకు రుణ EMIలు క్లియర్ చేయడం, టాక్స్ పోర్టల్స్ ద్వారా పన్నులు చెల్లించడం, బ్రోకరేజ్ ఫర్మ్స్‌కి ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బు పంపడం. ఇవన్నీ ఈ కేటగిరీకి వస్తాయి. ఇలాంటి చెల్లింపులకే ఇప్పుడు 5 లక్షల వరకు ఒక్క ట్రాన్సాక్షన్, రోజుకి గరిష్టంగా 10 లక్షల వరకు పంపే అవకాశం ఉంటుంది.
కానీ P2P (వ్యక్తి నుండి వ్యక్తికి) అంటే మనం స్నేహితులు, బంధువులకు యూపీఐ ద్వారా పంపే డబ్బు మాత్రం పాత రూల్స్‌కే పరిమితం అవుతుంది. అక్కడ లిమిట్ యథాతథంగా రోజుకి గరిష్టం 1 లక్ష మాత్రమే. అంటే పెద్ద మొత్తాలు బిజినెస్, టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం పంపాలంటే కొత్త లిమిట్ వర్తిస్తుంది, కానీ వ్యక్తిగత లావాదేవీల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు.
కొత్తగా యూపీఐ లిమిట్స్ పెరగడం వల్ల పలు రంగాల వారు బాగా లాభపడనున్నారు. ఉదాహరణకి, పన్నులు చెల్లించే వాళ్లకు ఇది చాలా ఉపయోగం అవుతుంది. ఇప్పటివరకు ఒక్కో ట్రాన్సాక్షన్‌లో 1 లక్ష మాత్రమే పంపగలిగేవారు. కానీ ఇప్పుడు ఒక్క ట్రాన్సాక్షన్‌లోనే 5 లక్షలు పంపొచ్చు, రోజుకి గరిష్టంగా 10 లక్షల వరకు పన్నులు చెల్లించొచ్చు. అలాగే, ఇన్సూరెన్స్ ప్రీమియంలు లేదా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వారికి కూడా ఇది రిలీఫ్. ముందు 2 లక్షల లిమిట్ ఉండేది, ఇప్పుడు అది 5 లక్షలకు పెరిగింది. రోజుకు మొత్తం 10 లక్షలు ట్రాన్సఫర్ చేయొచ్చు. రుణాల EMIలు లేదా బిజినెస్-టు-బిజినెస్ కలెక్షన్లు చేసే వాళ్లకు కూడా ఇదే లిమిట్ వర్తిస్తుంది. ఒక్కో ట్రాన్సాక్షన్ 5 లక్షలు, రోజుకి 10 లక్షలు.
క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించే వాళ్లు కూడా ఇప్పుడు ఎక్కువ మొత్తాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ముందు 2 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు 5 లక్షలకు పెరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది రోజుకు గరిష్టంగా 6 లక్షల వరకు మాత్రమే చెల్లించొచ్చు. అదేవిధంగా, ఫారెక్స్ ట్రాన్సాక్షన్లు కూడా ఒక్కోసారి 5 లక్షల వరకు చేయొచ్చు. చివరగా, డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఓపెన్ చేయడానికి కూడా ఒక్క ట్రాన్సాక్షన్‌లో 5 లక్షలు పెట్టొచ్చు. మొత్తానికి ఈ మార్పులు ఎక్కువ మొత్తాల డిజిటల్ చెల్లింపులు చేసే వారికి పెద్ద సౌకర్యంగా మారబోతున్నాయి.
IPO బిడ్డింగ్:
ఇక IPO బిడ్డింగ్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అంటే, యూపీఐ లిమిట్ పెంచినా, IPO అప్లికేషన్లకు వర్తించదు. ఇప్పటిలాగే ఒక్కో అప్లికేషన్‌కు గరిష్టంగా 5 లక్షల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎవరు IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, యూపీఐ ద్వారా 5 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. ఈ రూల్ మాత్రం యథాతథంగా కొనసాగుతుంది.
ఇప్పటివరకు యూపీఐని ఎక్కువగా మనం చిన్న చిన్న పేమెంట్స్‌కి మాత్రమే వాడేవాళ్లం దుకాణంలో షాపింగ్ చేయడం, బిల్లు చెల్లించడం లేదా ఫ్రెండ్స్‌కి డబ్బు పంపడం. కానీ ఇప్పుడు కొత్త లిమిట్స్ వచ్చేసరికి పెద్ద మొత్తాలు కూడా యూపీఐ ద్వారానే ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
ఇకపై NEFT, RTGS కోసం టైమ్ వేస్ట్ చేయాల్సిన పనిలేదు. బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి లాంగ్ ప్రాసెస్ చేయాల్సిన టెన్షన్ కూడా తగ్గిపోతుంది. సింపుల్‌గా ఫోన్‌లో ఒక ట్యాప్‌తోనే లక్షల్లో డబ్బు కూడా సేఫ్‌గా పంపేయొచ్చు. చిన్న పేమెంట్స్ నుంచి పెద్ద మొత్తాల వరకు అన్నీ యూపీఐలోనే హ్యాండిల్ అవుతాయి.
ఈ నిర్ణయం వల్ల బిజినెస్ వాళ్లు, ప్రొఫెషనల్స్ మాత్రమే కాదు, సాధారణ వినియోగదారులు కూడా బెనిఫిట్ పొందబోతున్నారు. యూపీఐ ఇప్పటి వరకు "స్మాల్ పేమెంట్స్ యాప్" అనే ఇమేజ్‌లో ఉండేది. కానీ ఇప్పుడు హై-వాల్యూ ట్రాన్సాక్షన్లకూ అదే ప్రాధాన్యం ఇవ్వబోతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications