పిఎఫ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నో వేటింగ్.. మీరే సొంతంగా అప్రూవ్ చేసుకోవచ్చు..
ప్రతిఒక్క కంపెనీ లేదా సంస్థలోని ఉద్యోగులకి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఈ ప్రావిడెంట్ ఫండ్ ఇపిఎఫ్ఒ నిర్వహిస్తుంది. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బు ఆటోమేటెడ్ ప్రాసెస్ ద్వారా విత్ డ్రా చేసుకోవడానికి కొత్తగా సెల్ఫ్-అప్రూవల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఈ సిస్టం PF విత్ డ్రా ప్రక్రియ సింపుల్ గా ఇంకా వేగంగా చేయడమే లక్ష్యం. ఇందులో ప్రస్తుతం అప్లయ్ చేసుకోవడం, అప్రూవల్, ఫామ్స్ సబ్మిషన్ చేయడం ఉన్నాయి.
అలాగే pf యూజర్ల రిక్వెస్ట్ వెరిఫై చేసి అప్రూవ్ చేసే వరకు వేచి ఉండాలి. దింతో పిఎఫ్ ఫండ్స్ అందుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. కొత్త సిస్టంతో ఇప్పుడు విత్ డ్రా రిక్వెస్ట్ సెల్ఫ్-అప్రూవల్ ఇంకా మాన్యువల్ జోక్యం లేకుండా చేస్తుంది. ఈ చర్యతో పిఎఫ్ విత్ డ్రా ప్రాసెసింగ్ టైం చాల వరకు తగ్గిస్తుందని, EPFO యూజర్లు ఇంకా వేగంగా పిఎఫ్ అందేలా చేస్తుందని భావిస్తున్నారు.

సెల్ఫ్ అప్రూవల్ సిస్టమ్ అప్‌గ్రేడ్ మార్చి 2025 నాటికి రెడీగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొత్త మెకానిజం రూపొందించాలని EPFO యోచిస్తోందని ఒక నివేదిక తెలిపింది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ PF విత్ డ్రా ప్రక్రియ మరింతగా యూజర్ ఫ్రెండ్లీ చేస్తుంది.
ఎడ్యుకేషన్ లేదా పెళ్లి: పిఎఫ్ యూజర్లు ఉన్నత చదువు లేదా పెళ్ళికి సంబంధించిన ఖర్చుల కోసం PF బ్యాలెన్స్‌లో 50% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
హోమ్ లోన్ రీపేమెంట్: హోమ్ లోన్ తిరిగి కట్టడానికి విత్ డ్రా పరిమితి PF బ్యాలెన్స్‌లో 90%.
ఈ పరిమితులు కొత్త మెకానిజం క్రింద ఒకే విధంగా ఉంటాయి, విత్ డ్రా ప్రక్రియ మాత్రమే అప్ డేట్ అవుతుందని తెలిపింది. అంతేకాదు EPFO విత్ డ్రా ప్రక్రియను సింపుల్ అండ్ ఈజీ చేయడానికి IT వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తుంది
ప్రాసెస్ చేసిన క్లెయిమ్ మొత్తం కోసం డిజిటల్ వాలెట్‌ను కూడా ప్రవేశపెట్టడం పై కూడా EPFO పరిశీలిస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫీచర్‌ను అమలు చేయడానికి ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)తో సంప్రదింపులు అవసరం. FY24 నాటికి EPFO మొత్తం కార్పస్ రూ.24.75 లక్షల కోట్లుగా ఉంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రూ.1 లక్ష వరకు అడ్వాన్స్ క్లెయిమ్‌ల కోసం ఆటో-మోడ్ ప్రాసెసింగ్‌ను ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications