IPO News: సంచనం సృష్టించిన ఐపీవో.. తొలిరోజే ప్రీమియం ఎంట్రీ.. మీరూ కొన్నారా..??
Gala Precision IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడు ఐపీవోలు కొత్తగా సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకుంటుండగా.. నేడు ఒక ఐపీవో బంపర్ లిస్టింగ్ నమోదు చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గాలా ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు అస్థిర మార్కెట్లలో సైతం 41.78 శాతం ప్రీమియం ధర రూ.750 వద్ద బీఎస్ఈలో బలమైన ప్రవేశాన్ని నమోదు చేశాయి. ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో స్టాక్ 36.31 శాతం ప్రీమియంతో రూ.721.10 రేటు వద్ద లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి మెయిన్ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఇష్యూ సమయంలో ఒక్కో షేరును గరిష్ఠంగా రూ.529 ధరకు విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీవో మార్కెట్లు ఊహించిన విధంగానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

లిస్టింగ్ ముందు గ్రేమార్కెట్లలో కంపెనీ షేర్లు రూ.245-250 ప్రీమియం పలికాయి. అంటే దాదాపు 50 శాతం లిస్టింగ్ గెయిన్స్ ఊహించబడింది. కంపెనీ తన ఇష్యూను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 4 వరకు అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.503-529 వద్ద ఉంచింది. అలాగే లాట్ పరిమాణాన్ని 28 షేర్లుగా ప్రకటించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి మెుత్తం రూ.169.93 కోట్లను విజయవంతంగా సేకరించింది. ఇందులో రూ. 135.34 కోట్ల వరకు తాజా ఆఫర్ ఉండగా.. మిగిలిన మెుత్తాన్ని 6,16,000 ఈక్విటీ షేర్లను కంపెనీ ఆఫర్-ఫర్-సేల్ రూపంలో ఉంచింది.
కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. థానే కేంద్రంగా పనిచేస్తున్న గాలా ప్రెసిషన్ ఇంజినీరింగ్.. డిస్క్ అండ్ స్ట్రిప్ స్ప్రింగ్‌లు(DSS), కాయిల్ అండ్ స్పైరల్ స్ప్రింగ్‌లు(CSS), స్పెషల్ ఫాస్టెనింగ్ సొల్యూషన్స్(SFS) వంటి ఖచ్చితమైన భాగాల తయారీదారుగా కొనసాగుతోంది. కంపెనీ తన వ్యాపారాన్ని 2009లో స్థాపించబడింది. కంపెనీ వీటిని ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు సరఫరా చేస్తోంది. దేశీయ బ్రోకరేజ్ సంస్థలు సైతం ప్రస్తుత ఐపీవోపై ఎక్కువగా సానుకూలతను కలిగి ఉన్నారు. దీర్ఘకాలిక వ్యూహంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా పరిగణించొచ్చని వారు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications