Multibagger Stock: మార్కెట్లలో ర్యాలీ ఉన్న లేకున్నా మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం సైలెంట్ గా తమపని తాము చేసుకుపోతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఒక ప్రభుత్వ యాజమాన్య కంపెనీ తన పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా మార్చేసింది.
మహారత్న కంపెనీ గెయిల్ ఇండియా షేర్లు విపరీతమైన రాబడులను ఇచ్చాయి. ప్రభుత్వ కంపెనీల షేర్లు దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను ధనవంతులను చేశాయి. గెయిల్ ఇండియా షేర్లు పెరుగుదలతో రూ.లక్ష పెట్టుబడిని రూ.1.5 కోట్లకు పైగా మార్చాయి. ఈ క్రమంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు 5 సార్లు బోనస్ షేర్లను బహుమతిగా అందించింది. గెయిల్ ఇండియా షేర్ల ఆల్ టైమ్ హై లెవెల్ రూ.153.10గా ఉంది. ఇదే సమయంలో కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.90.70గా ఉంది.

ప్రభుత్వ సంస్థ గెయిల్ ఇండియా 2008 నుంచి 5 సార్లు బోనస్ షేర్లను ఉచితంగా పెట్టుబడిదారులకు అందించింది. GAIL ఇండియా షేర్లు 21 డిసెంబర్ 2001న రూ.7.65 వద్ద ఉన్నాయి. ఒక వ్యక్తి డిసెంబర్ 21, 2001న గెయిల్ ఇండియా షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే.. అతనికి కంపెనీకి చెందిన 13,070 షేర్లు వచ్చేవి. ఇన్వెస్టర్లు ఈ కాలంలో గెయిల్ ఇండియా నుంచి 5 సార్లు బోనస్ షేర్లును అందుకున్న తర్వాత మెుత్తం షేర్ల సంఖ్య 1,04,562 చేరుకుంటుంది. తాజాగా డిసెంబర్ 22న మార్కెట్ ధర రూ.151.45ని పరిగణలోకి తీసుకుంటే మెుత్తం పెట్టుబడి విలువ రూ.1.58 కోట్లకు చేరుకుంది. దీంతో పెట్టుబడిదారులు కోటీశ్వరులుగా మారిపోయారు.
మహారత్న కంపెనీ గెయిల్ ఇండియా 2008 నుంచి 5 సార్లు బోనస్ షేర్లు ఇచ్చింది. గెయిల్ ఇండియా అక్టోబర్ 2008లో 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసింది. అంటే కంపెనీ ప్రతి 2 షేర్లకు 1 బోనస్ షేర్ ఇచ్చింది. కంపెనీ మార్చి 2017లో 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చింది. గెయిల్ ఇండియా మళ్లీ మార్చి 2018లో 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించింది. ప్రభుత్వ కంపెనీ జూలై 2019లో 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. చివరగా గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వటంతో పెట్టుబడిదారుల వద్ద కంపెనీకి చెందిన షేర్ల సంఖ్య భారీగా పెరిగింది.


Click it and Unblock the Notifications