G20 Summit: ఈసారి జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం వహించింది. ఇది విజయవంతమైనప్పటికీ అనేక మంది సామాన్యులు భారీగా నష్టపోయారు.
దిల్లీలో భారత్ సదస్సును విజయవంతమైనప్పటికీ.. దీనికోసం దుకాణాలు మూసివేతలు చేయటం, ట్రాఫిక్ నియంత్రణల కారణంగా వ్యాపారాలకు రూ.400 కోట్ల నష్టం వాటిల్లిందని వార్తా సంస్థలు నివేదించాయి. దిల్లీలో భద్రతా పరమైన కారణాలతో ముందస్తుగా మార్కెట్లు, మాల్స్ మూసివేతకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దాదాపు 9,000 మంది డెలివరీ కార్మికులపై ప్రభావం పడింది.

జీ20 సదస్సు కారణంగా వ్యాపారులకు సుమారు రూ.300-400 కోట్ల నష్టం వాటిల్లిందని న్యూ దిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ భార్గవ వెల్లడించారు. షాపింగ్, డైనింగ్‌లకు ప్రసిద్ధి చెందిన ఖాన్ మార్కెట్, కన్నాట్ ప్లేస్, జన్‌పథ్ వంటి అగ్ర మార్కెట్‌లలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి రావడంతో నియంత్రిత జోన్ బయట ఉన్న వ్యాపారాలు సైతం దెబ్బతిన్నారు. ఎక్కువగా వారాంతపు షాపింగ్ వల్ల వచ్చే ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలిపారు.
దిల్లీలో డైనింగ్, డైన్-ఇన్, డెలివరీ సంఖ్యలు కనీసం 50% తగ్గాయి. NCR ప్రాంతంలో అమ్మకాలు 20% మేర తగ్గాయి. పంజాబ్ గ్రిల్, జాంబర్, యూమీని నిర్వహిస్తున్న లైట్ బైట్ ఫుడ్స్‌కు చెందిన రోహిత్ అగర్వాల్ తక్కువ అమ్మకాలను ధృవీకరించారు.


Click it and Unblock the Notifications