ముంబై: 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి మైనస్ 7.4 శాతంగా నమోదు కావొచ్చునని SBI రీసెర్చ్ అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటోందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తోన్న విషయం తెలిసిందే. ఎస్బీఐ గతంలో మైనస్ 10.9 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు మైనస్ 7.4 శాతంగా సవరించింది. జీడీపీ వృద్ధి రేటు 2020-21 నాలుగో త్రైమాసికం నుండి 7 త్రైమాసికాల తర్వాత మళ్లీ పూర్వస్థితికి చేరుకోవచ్చునని ఎస్బీఐ ఎకోరాప్ తెలిపింది.

వృద్ధిరేటు అంచనాలు
ప్రస్తుతం మూడో త్రైమాసికంలో 0.1 శాతం, నాలుగో త్రైమాసికంలో 1.7 శాతం మేర వృద్ధి నమోదు కావొచ్చునని అంచనా వేసింది. పారిశ్రామిక, సేవారంగాలకు సంబంధించి 41 సూచీలను ప్రామాణికంగా తీసుకొని, ఈ అంచనాలను వెలువరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 11 శాతం చేరుకోవచ్చునని తెలిపింది. కరోనా రెండో దశ వ్యాప్తి పెద్దగా లేకపోతేనే అనే ప్రతిపాదికన ఈ అంచనాలు రూపొందించినట్లు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 8 శాతానికి సవరించింది.

ఎస్ అండ్ పీ కూడా
ప్రభుత్వ ఎక్స్పెండిచర్ మొదటి త్రైమాసికంలో రూ.4.86 లక్షల కోట్లు కాగా, రెండో త్రైమాసికంలో రూ.3.62 లక్షల కోట్లకు చేరుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి మైనస్ 7.7 శాతంగా నమోదు కావొచ్చునని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవల అంచనా వేసిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటోందని, ఈ నేపథ్యంలో గతంలో ప్రకటించిన మైనస్ 9 శాతం అంచనాను సవరించినట్లు ఎస్ అండ్ పీ తెలిపింది. వచ్చే ఏడాది మాత్రం వృద్ధి రేటు 10 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది.

వృద్ధి రేటు సవరణ
వరుసగా రెండు త్రైమాసికాలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా నమోదు చేయడంతో సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. అయితే ఆగస్ట్ తర్వాత నుండి రికవరీ వేగవంతమైంది. తయారీ, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తర్వాత స్థూల ఆర్థిక సూచీలు పెరిగాయి. ఆసియా పసిఫిక్ దేశాల మార్గంలోనే భారత్ వేగంగా కోలుకుంటోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఫిచ్ రేటింగ్స్ కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును మైనస్ 10.5 శాతం నుండి మైనస్ 9.4 శాతానికి సవరించింది. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు గతంలో మైనస్ 9 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు మైనస్ 8 శాతంగా అంచనా వేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications