రిలయన్స్ నుండి ఫ్యూచర్ గ్రూప్‌కు ఆపరేషనల్ సపోర్ట్, 6 నెలల వెసులుబాటు

రిలయన్స్ - ఫ్యూచర్ రిటైల్‌కు మధ్య జరిగిన ఒప్పందం విఫలం కాకుండా కార్యకలాపాల మద్దతు కొనసాగించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఫ్యూచర్ రిటైల్ ఆస్తుల కొనుగోలు కోసం కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT) నుండి అనుమతి లభించవలసి ఉంది.

మంగళవారం NCLT తీర్పు వెలువరించాల్సి ఉండింది. కానీ ఈ కేసును 15వ తేదీకి వాయిదా వేసింది. ఫ్యూచర్ గ్రూప్-అమెజాన్ మధ్య న్యాయ పోరాటం కారణంగా ఆలస్యమవుతోన్న నేపథ్యంలో కొనుగోలు పూర్తికి ఉన్న అంతర్గత గడువును 6 నెలల పాటు రిలయన్స్ పొడిగించినట్లు చెబుతున్నారు. అమెజాన్‌తో న్యాయపోరాటం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో మే నెలలోపు నియంత్రణపరమైన అనుమతులు లభించడం అసాధ్యమని, అందుకే కనీసం 6 నెలల సమయాన్ని కంపెనీ పొడిగించిందని అంటున్నారు.

Future Retail receives operational support from Reliance as deal lingers in courts

కాగా, ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్‌కు అమెజాన్ ద్వారా చిక్కులు వచ్చిన విషయం తెలిసిందే. రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలంటే 4 కోట్ల డాలర్లు లేదా దాదాపు రూ.290 కోట్ల పరిహారం చెల్లించాలని అమెజాన్ కోరిందని ఫ్యూచర్ గ్రూప్ గతంలో ఆరోపించింది. ఈ ఆరోపణలను అమెజాన్ ఖండించింది. మొత్తానికి రిలయన్స్‌తో డీల్ అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య వివాదానికి దారి తీసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+