Futur Retail Stock: కరోనా కాలంలో చాలా కంపెనీల కనుమరుగయ్యాయి. వ్యాపారాలు నిలిచిపోవటంతో పాటు ఆదాయాలు తగ్గటం, రుణ భారం పెరగటం వంటి కారణాలు చాలా కంపెనీలను దివాలా తీసే దిశగా నడిపించాయి.
స్టాక్ మార్కెట్ ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తూ ఊహించని బుల్ ర్యాలీని కొనసాగిస్తోంది. ఈ బూమ్ మధ్య కొన్ని దివాళా తీసిన కంపెనీల షేర్లు కూడా రాకెట్ లా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ అయిన ఫ్యూచర్ రిటైల్ షేర్ల గురించే. గురువారం కంపెనీ షేర్లలో బలమైన పెరుగుదల కనిపించింది. వారం చివరి ట్రేడింగ్ రోజున ఈ స్టాక్‌లో 4 శాతానికి పైగా పెరిగింది.

ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ షేరు గురువారం నాటి ధర రూ.2.07తో పోలిస్తే 4.83% పెరుగుదలతో రూ.2.17కి చేరుకుంది. ఈ షేర్ 52 వారాల గరిష్టం రూ.3.93గా ఉంది. వాస్తవానికి 5 ఏళ్ల కిందట ఈ షేర్ ధర రూ.560గా ఉంది. ప్రస్తుతం ధర దీని కంటే దాదాపు 99 శాతం తక్కువ. గతంలో రిలయన్స్ గ్రూప్ దీనిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన సమయంలో షేర్లు కొంత పుంజుకున్నాయి. అయితే చట్టపరమైన చిక్కుల కారణంగా చివరికి డీల్ జరగలేదని తెలిసిందే.
ఫ్యూచర్ రిటైల్ కోసం రిజల్యూషన్ ప్లాన్‌లో స్పేస్‌మంత్ర మాత్రమే బిడ్డర్. దివాలా తీసిన సంస్థ లిక్విడేషన్‌ను నివారించడానికి ఇది దాని మునుపటి బిడ్‌ను సవరించింది. ఇటీవల మీడియా నివేదికల ప్రకారం మునుపటి బిడ్ కంటే కొత్త బిడ్ చాలా ఎక్కువ అని, మొత్తం ప్రక్రియను పునఃపరిశీలించవలసిందిగా అడ్మినిస్ట్రేటర్ అండ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్(CoC)ని కంపెనీ అభ్యర్థించింది. CoCలో బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లన్ అత్యధిక ఓటింగ్ వాటాను 21.18% కలిగి ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.17%, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.95% వాటా హోల్డ్ చేస్తున్నాయి. కంపెనీ షేర్లను నమ్ముకున్న చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.


Click it and Unblock the Notifications