Future Group: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలో అనేక మందికి ఇష్టమైన ప్రదేశం. అయితే తన వ్యాపారాన్ని అత్యుత్తమంగా నిర్వహించటానికి తిరుమలకు వెళ్లి కొన్ని విషయాలు నేర్చుకున్నట్లు ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీ వెల్లడించారు.
దేశంలో చాలా ప్రాచుర్యం పొందిన బిజ్ బజార్ స్టోర్ల యజమాని కిషోర్ బియానీ. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ తన వ్యాపారానికి తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న సంబంధాన్ని వెల్లడించారు. ఒకనొక సమయంలో తమ Big Bazaar స్టోర్లకు భారీగా కస్టమర్లు వచ్చేవారని బియానీ అన్నారు. అయితే ఇంత భారీ సంఖ్యలో వస్తున్న జన సమూహాలను నిర్వహించటం గురించి నేర్చుకునేందుకు తిరుమల ఆలయాన్ని సందర్శించినట్లు వెల్లడించారు.

ప్రఖ్యాత బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తో జరిగిన పాడ్‌కాస్ట్ లో కిషోర్ బియానీని 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిటైల్' అని ప్రశంశించారు. ప్రస్తుతం దేశంలో పాపులర్ అయిన డీమార్ట్ స్టోర్ల రాకకు ముందు మధ్యతరగతి రిటైల్ వినియోగదారులు ఎక్కువగా బిగ్ బజార్ స్టోర్లలో షాపింగ్ చేసేవారు.
2001లో ఫ్యూచర్ రిటైల్ కింద ప్రారంభమైన బిగ్ బజార్ భారీ తగ్గింపులకు ఉత్పత్తులను అందిచటంతో మార్కెట్లో ప్రసిద్ధి చెందింది. దేశవ్యాప్తంగా 125 నగరాల్లో సంస్థకు దాదాపు 250 స్టోర్లను కలిగి ఉంది. కంపెనీ విజయవంతంగా నడిచినప్పటికీ.. దేశంలో ఈ-కామర్స్ వృద్ధి, నిధుల కొరత వంటి అనేక కారణాలు కంపెనీని నష్టాల్లోకి నెట్టాయి. దీంతో వ్యాపారాన్ని రూ.24,713 కోట్లకు ముఖేష్ అంబానికి విక్రయించటంతో అమెజాన్ నుంచి చిక్కులు మెుదలయ్యాయి.
ప్రస్తుతం ఈ వ్యవహారం సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ న్యాయస్థానంలో తీర్పు కోసం పోరు కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications