ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు షాక్! సింగపూర్ ఆర్బిట్రేషన్‌కు లాగిన అమెజాన్
రిలయన్స్ ఇండస్ట్రీస్-ఫ్యూచర్ గ్రూప్ డీల్‌కు అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ షాకిచ్చింది. ఫ్యూచర్ గ్రూప్‌తో తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ విరుద్ధమని సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను(SIAC) ఆశ్రయించింది. నిబంధనల ఉల్లంఘనకు గాను ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ డీల్‌ను నిలుపుదల చేయాలని కోరింది. SIAC లాభాపేక్షలేని సంస్థ. క్రాస్ బోర్డర్స్ ట్రాన్సాక్షన్స్ వల్ల వచ్చే వివాదాలను పరిష్కరిస్తుంది.

గత ఏడాది అమెజాన్ కొనుగోలు
అమెజాన్ డాట్ కామ్ గత ఏడాది ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. అప్పుడు ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. ఒప్పంద నిబంధనల ప్రకారం ఫ్యూచర్ రిటైల్‌ను మూడేళ్ల నుండి పదేళ్ల మధ్య ప్రమోటర్‌కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్‌కు అధికారాలు ఉన్నాయి. దీంతో అమెజాన్.. కిషోన్ బియానీ నేతృత్వంలోని ప్యూచర్ గ్రూప్‌కు లీగల్ నోటీసులు పంపించింది. 2019లో అమెజాన్-ఫ్యూచర్ మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొంది. స్టాక్ ఎక్స్చేంజీలకు, స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్‌కు లేఖ రాసింది.

అదే జరిగితే భారీ పెనాల్టీ విధించే ఛాన్స్
డీల్ ప్రకారం తమ హక్కులు కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున వివరాలను వెల్లడించలేమని అమెజాన్ ప్రతినిధి చెబుతున్నారు. ఫ్యూచర్ గ్రూప్ నోటీసులపై స్పందించాల్సి ఉంది. తమ డీల్‌ను గౌరవించాలనేది అమెజాన్ ఉద్దేశ్యమని, అయితే ఇది రిలయన్స్ - ఫ్యూచర్ గ్రూప్ డీల్ పైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫ్యూచర్ గ్రూప్ - రిలయన్స్ డీల్ అమెజాన్‌తో గతంలో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా లేకుంటే SIAC భారీ పెనాల్టీ విధించే అవకాశం ఉందని అంటున్నారు. కానీ అమెజాన్ అసలు లక్ష్యం అది కాదంటున్నారు.

సామరస్యంగా పరిష్కరించుకోవాలని..
ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఫ్యూచర్ గ్రూప్ భావిస్తోంది. వాస్తవానికి అసెట్స్ విక్రయానికి సంబంధించి ఇతర వ్యాపార సంస్థలతో పాటు అమెజాన్‌కు కూడా ఫ్యూచర్ గ్రూప్ ఆఫర్ ఇచ్చిందని, అది తిరస్కరించిన తర్వాతనే రిలయన్స్ గ్రూప్‌తో ఒప్పందానికి ముందుకు వచ్చిందంటున్నారు. పైగా FDI నిబంధనలు, ఫ్యూచర్ గ్రూప్‌లో తదుపరి పెట్టుబడులు పెట్టే హక్కులు మూడేళ్ల తర్వాత అమెజాన్‌కు ఉండటం.. ఫ్యూచర్ గ్రూప్ సంస్థల్లో ఆ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రధాన అడ్డంకులు అంటున్నారు. కాగా, రిటైల్, హోల్ సేల్, లాజిస్టిక్, వేర్ హౌసింగ్ విభాగాలను రిలయన్స్‌కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఈ ఆగస్ట్‌లో రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ వ్యాల్యూ రూ.24,713 కోట్లు. అయితే ఈ డీల్ ఇంకా పూర్తికాలేదు.


Click it and Unblock the Notifications