భారత్‌కు మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం
భారత్‌కు మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) అభిప్రాయపడింది. ఆరోగ్య, ఆహార రంగాల్లో వ్యయాలకు, ఇబ్బందుల్లోని గృహస్తులకు ఆదాయ మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారులకు చేయూత కోసం ఉద్దీపన అవసరమని తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి తీరు బాగుందని, అల్పాదాయ కార్మికులు, ప్రజలకు, ఆర్థిక రంగం కోసం చేపట్టిన ద్రవ్య లభ్యత చర్యలు బాగున్నాయని తెలిపింది. అయితే మరింత ద్రవ్య లభ్యత అవసరమని పేర్కొంది.
కరోనా కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం మేర ప్రతికూలత నమోదు చేసిన విషయంతెలిసిందే. వైరస్ కట్టడికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మరో ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వడం ద్వారా ఇది మార్కెట్ విశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుందని తెలిపింది. మరో ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని అభిప్రాయపడింది.

కాగా, కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పతనమైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్‌లో జీడీపీ ఏకంగా 23.9 శాతం మేర క్షీణించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. మరో విడత ప్యాకేజీ సెప్టెంబర్‌లో ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనారోగ్యకర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించేందుకు మరో విడత ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. మరో విడత ఆర్థిక ప్యాకేజీ అవసరమని ఆర్థిక నిపుణులు కూడా భావిస్తున్నారు.
గత ఆర్థిక ప్యాకేజీ ప్రధానంగా ఎంఎస్ఎంఈలు, వీధి వ్యాపారులు సహా వివిధ వర్గాలకు వెసులుబాటు కల్పించారు. ఈసారి మధ్య తరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారాలపై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ ముగిసి, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి కోలుకుంటున్నాయి. చాలా రాష్ట్రాల్లో తిరిగి వ్యాపారాలు, సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజకరంగా ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications