Layoffs: వందల మందిని తొలగించిన ఫర్నిచర్ దిగ్గజం.. ఇండియన్ సీఈవో పై బాయ్‌కాట్..
Wayfair Layoffs: ప్రస్తుతం ఉన్న వ్యాపార అస్థిర పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపులు కేవలం ఒక రంగానికో లేక ఒక పరిశ్రమకు మాత్రమే పరిమితం కావటం లేదు. తాజాగా ఫర్నిచర్ రిటైల్ వ్యాపారంలో ఉన్న దిగ్గజం ఉద్యోగుల కోతను ప్రకటించింది.
అవును వేఫెయిర్ సంస్థ శుక్రవారం ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. మెుత్తం పనిచేస్తున్న ఉద్యోగుల్లో 13 శాతం అంటే 1,650 మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ఎక్కువ సమయం ఉద్యోగులు పనిచేయాలని డిసెంబరులో సీఈవో నిరాజ్ షా పంపిన మెమో తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే రానున్న కాలంలో మరోమారు కంపెనీ లాభదాయకంగా మారుతుందని ఆన్‌లైన్ రిటైలర్ పేర్కొంది.

సీఈవో పంపిన మెయిల్ వెలుగులోకి రావటంతో ఇంటి వస్తువుల రిటైలర్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంతతి CEO విషపూరితమైన పని సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. విజయం సాధించాలంటే తప్పకుండా పనిచేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో వెల్లడించారు. అమెరికాలో స్థిరపడిన షా కుటుంబం 2002లో వేఫెయిర్ కంపెనీని ప్రారంభించింది.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ర్క్-లైఫ్ బ్యాలెన్స్. పని ఒత్తిడితో కుటుంబాన్ని దూరం చేసుకున్న అనేక మందిని చూసిన తర్వాత నేటి తరం ప్రజలు ఈ రెండించి మధ్య సరైన సమతుల్యతను పాటించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక సీఈవో ఉద్యోగులను తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికంగా పనిచేయాలని కోరటం వల్ల టాక్సిక్ వర్క్ కల్చర్ విస్తరిస్తుందని, అందువల్ల సదరు కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయటం మానేయాలని చాలా మంది సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేయటం వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications