Cheyutha Pensions: గుడ్ న్యూస్.. నవంబర్ 26న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ..!
ఎన్నో ఏళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా 4,63,857 మందికి చేయూత పింఛన్ మంజూరు చేసింది. కొత్త పెన్షన్లు మంజూరు అయిన వారికి నవంబర్ 12 నుంచి 18 మధ్య మంజూరు పత్రాలు జారీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ మంజూరు పత్రాలు అందించారు. కొత్తగా పింఛన్ మంజూరు అయిన వారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పారు. నవంబర్ 26న కొత్త పింఛన్ మంజూరు అయిన 4,63,857 మందికి పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది.
ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత వారితో పాటు కొత్తవారికి పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కొత్తగా 4,63,857 చేయూత పెన్షన్లు డబ్బులు జమ చేయనుండగా.. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. పింఛన్లలో వితంతువులకే సింహభాగం దక్కింది. మొత్తం కొత్త లబ్ధిదారుల్లో దాదాపు 60 శాతం అంటే 2,77,894 మంది వితంతువులకు ప్రభుత్వం కొత్తగా పింఛన్లు ఇచ్చింది. 1,00,224 మంది దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులకు కొత్త పెన్షన్లు వచ్చాయి.

మొదటగా నవంబర్ 19న బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్ 26న పింఛన్ డబ్బులు జమ చేయనున్నారు. కొత్త పింఛన్ల మంజూరులో హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 35,730 పింఛన్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా 30,232, నల్గొండ జిల్లా 26,546, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 25,671, ఖమ్మం జిల్లాకు 22,801 పెన్షన్లు మంజూరయ్యాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో కేవలం 4,087 కొత్త పింఛన్లు మాత్రమే వచ్చాయి. వితంతు పించన్లు-24,956, ఒంటరి మహిళా పించన్లు-4,714 హైదరాబాద్లోనే అత్యధికంగా మంజూరయ్యాయి.
దివ్యాంగుల పించన్లు(7,007), గీత కార్మికుల పించన్ల (3,492) లో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, చేనేత కార్మికుల పింఛన్లు యాదాద్రి భువనగిరి (932), రాజన్న సిరిసిల్ల (910) జిల్లాల్లో ఎక్కువగా వచ్చాయి. నవంబర్ 26న కొత్త పింఛన్ల డబ్బులు జమతో పాటు ఇందిరమ్మ చీరలు కూడా పంపిణీ చేయనున్నారు. కోటి మంది మహిళలకు చీరలు అందించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications