Quant Fund: ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఇటీవల జరిపిన సెర్చ్ ఆపరేషన్స్‌తో క్వాంట్ ఫండ్ హౌస్ చిక్కుల్లో పడింది. సదరు సంస్థపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఆయా స్కీమ్స్‌లో పెట్టిన తమ పెట్టుబడిని తిరిగి తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఇదికాస్తా మార్కెట్లలో గందరగోళానికి దారితీస్తోంది.
పలువురు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్ రన్నింగ్ కేసులో సెబీ దర్యాప్తు తర్వాత 3 రోజుల్లోనే సుమారు 1,400 కోట్ల విలువైన పెట్టుబడులను రీడీమ్ చేసుకున్నారు. అంతేకాకుండా సంస్థకు చెందిన వివిధ స్కీమ్‌లలో తాజా పెట్టుబడులు మరియు SIPలను ప్రారంభించాలా లేదా అనే సందేహిస్తున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న వాటిని సైతం నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు.

'పెట్టుబడులను రిడీమ్ చేయడం అనేది వ్యక్తిగత నిర్ణయం. అది ఇన్వెస్టర్ అవసరాలపై పూర్తిగా ఆధారపడి ఉంటుంంది. అయితే ఇప్పటికే ఉన్న పెట్టుబడులను కొనసాగించడం మంచి విధానం. పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చిన తర్వాత ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు' అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ప్రతినిధి హిమాన్షు శ్రీవాస్తవ సూచించారు.
'తాము కేవలం దర్యాప్తు మాత్రమే చేస్తున్నామని సెబీ పేర్కొంది. ఫ్రంట్ రన్నింగ్ జరిగిందని ఇంకా నిర్ధారించలేదు. క్వాంట్ పెట్టుబడి విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఫండ్ మేనేజర్ విచక్షణపై కాకుడా క్వాంటిటేటివ్ ఇన్వెస్టిగేటింగ్ పద్ధతిని అనుసరిస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఫండ్ మేనేజర్‌లు మారినా పెట్టుబడి విధానంలో మార్పు ఉండదు. ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనేది వారి అల్గారిథమ్‌పై ఆధారపడి ఉండటంతో ఆయా ఫండ్స్‌పై ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది' అని ఫైనాన్షియల్ రేడియన్స్ వ్యవస్థాపకులు రాజేష్ మినోచా పేర్కొన్నారు.
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇదే మొదటి ఫ్రంట్ రన్నింగ్ కేసు కాదని రాజేష్ గుర్తుచేశారు. రెండేళ్ల క్రితం మరో పెద్ద AMC విషయంలోనూ ఇలాగే జరిగినట్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ఫండ్ హౌస్ బలంగా బౌన్స్ అవుతుందని స్పష్టం చేశారు. ఎక్కువ కాలం ఇన్వెస్ట్‌మెంట్‌లో కొనసాగే వారు మంచి రాబడిని సొంతం చేసుకోవచ్చన్నారు. ఈ తరహా వ్యవహారాలు సర్వసాధారణమైనప్పటికీ, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ భారీగా నియంత్రించబడుతుందని వివరించారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications