Motilal Oswal: నేటి యువతకు సరైన బ్రోకరేజ్ ఎంపిక.. బోలెడన్ని ప్రయోజనాలు..
Motilal Oswal: ప్రస్తుత కాలంలో డీమ్యాట్ ఖాతా అంటే తెలియని యువత ఉన్నారనటం అతిశయోక్తి కాదు. పైగా కరోనా కాలంలో చాలా మంది దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, క్రయవిక్రయాలు చేయటం బాగా అలవాటు పడ్డారు. వీరు ఎక్కువగా స్నేహితులు, బంధువులు ఇతరాలపై సలహాలకోసం ఆధారపడుతున్నారు. అలా వారికి తెలియకుండానే నష్టాలపాలవుతున్నారు.

సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్..
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ ట్రేడింగ్ చేయాలంటే సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ ద్వారా చేయాలి. అయితే దీనిలో ప్రధాన సమస్య సరైన బ్రోకరేజ్ సంస్థను ఎంచుకోవటంలో ఉంటుంది. చాలా మంది ప్రస్తుతం పూర్తి స్థాయి బ్రోకర్ల కంటే డిస్కౌంట్ బ్రోకర్ల వైపు మెుగ్గుచూపుతున్నారు. అయితే మోతీలాల్ ఓస్వాల్ వంటి బ్రోకర్ ను ఎంచుకోవటం ద్వారా ఇన్వెస్టర్లకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దశాబ్దాల అనుభవం, ఈక్విటీలపై పరిశోధన, మంచి రీసెర్చ్ టీం వంటివి కంపెనీకి అతిపెద్ద బలాలుగా ఉన్నాయి.

మోతీలాల్ ఓస్వాల్
| మోతీలాల్ ఓస్వాల్ | డిస్కౌంట్ బ్రోకర్ | |
| పర్సనలైజ్డ్ సర్వీస్ | కంపెనీ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా అనుభవజ్ఞులైన వ్యక్తులను సర్వీస్ కోసం ఏర్పాటు చేస్తుంది | డిస్కౌంట్ బ్రోకర్ల విషయంలో కాల్ సెంటర్ కు ఫోన్ చేయటం లేదు ఈ-మెయిల్ పంపాల్సి ఉంటుంది |
| కస్టమర్ అవసరాలు | మోతీలాల్ ఓస్వాల్ లో కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని వారికి అనుకూలమైన సలహాలు, పరిష్కారాలను అందిస్తారు | డిస్కౌంట్ బ్రోకర్ల విషయంలో ఇలాంటి ప్రత్యేక శ్రద్ధ ఉండదు |
| శిక్షణ పొందిన రీసెర్చ్ డెస్క్ | కంపెనీ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్టులు, నిపుణులను కలిగి ఉంటుంది | డిస్కెంట్ బ్రోకర్ల విషయంలో ఇలాంటి డెడికేటెడ్ సర్వీసెస్ ఉండవు |
| ఫేస్ టూ ఫేస్ | కంపెనీకి దేశంలోని దాదాపు 98 శాతం పిన్ కోడ్లలో ఆఫీసులు ఉన్నందున ముఖాముఖి కమ్యూనికేషన్ సులువు | డిస్కౌంట్ బ్రోకర్ల విషయంలో ఇలాంటి వెసులుబాటు ఉండదు |
| బ్రోకరేజ్ ఛార్జీలు | స్వల్పంగా ఎక్కువ | ఫుల్ సర్వీస్ బ్రోకర్ల కంటే కొంచెం తక్కువ |

రీసెర్చ్ సపోర్ట్..
యువ పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్ మెంట్లను నిరంతరం పర్యవేక్షించటం, వారికి సరైన సలహాలు ఇవ్వటం కోసం రీసెర్చ్ టీంను మోతీలాల్ ఓస్వాల్ కలిగి ఉంది. అనుభవజ్ఞులైన విశ్లేషకులు, అత్యుత్తమ ఈక్విటీ రీసెర్చ్ టీంను కంపెనీ కలిగి ఉంది. వీరు యువతకు మంచి మార్గదర్శకత్వం చేస్తూ స్టాక్స్, కమోడిటీస్, ఆప్షన్స్ ట్రేడింగ్ వంటి వాటిలో విలువైన సేవలను అందిస్తారు. పైగా కంపెనీకి దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆఫీసులు ఉన్నందున భౌతికంగా వినియోగదారులు వెళ్లేందుకు అవకాశం ఉంది. డిస్కౌంట్ బ్రోకర్ల విషయంలో ఇది అసాధ్యమైనది.

బ్రోకరేజ్ ఛార్జీలు..
ఫుల్ సర్వీస్ బ్రోకర్లు డిస్కౌంట్ బ్రోకర్ల కంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. వీరు కొనుగోలు, విక్రయం చేసిన ఈక్విటీల సంఖ్య అధారంగా ఛార్జీలు వసూలు చేస్తారు. డిస్కౌంట్ బ్రోకర్ల విషయంలో కొంత పరిమాణానికి ఫిక్స్ డ్ ఛార్జీలు వసూలు చేయటం కామన్. పైగా ఫుల్ సర్వీస్ బ్రోకర్లు ఇచ్చే సర్వీల కారణంగా వారికి చెల్లించే మెుత్తం కొంత ఎక్కువ ఉన్నప్పటికీ చాలా ప్రయోజనకరం. ఇవి డీమ్యాట్ ఖాతాదారులకు అనేక విధాలుగా ఉపయుక్తం కూడా. అందుకే మోతీలాల్ ఓస్వాల్ ద్వారా ట్రేడింగ్ చేసేందుకు మిలీనియల్స్ ట్రేడింగ్ ఖాతాలను తెరవటం చాలా ప్రయోజనకరం కూడా.


Click it and Unblock the Notifications