దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభత్వం గిగ్ వర్కర్స్ బిల్లుని అమలుచేయబోతోంది. దీనికై కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా గిగ్వర్కర్ల చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. అసలు గిగ్ వర్కర్లు అంటే ఎవరు? దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
గిగ్ వర్కర్స్ అంటే..
ప్లాట్ ఫామ్ వర్కర్లు, మొబిలిటీ, డెలివరీ, లాజిస్టిక్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులను గిగ్ వర్కర్లు అంటారు. ఇలాంటి వాళ్లు తెలంగాణలో సుమారు 4 లక్షల వరకు ఉన్నారు. వీళ్లు రోజుకు 10 నుంచి-12 గంటల చొప్పున వారానికి 7 రోజులు పనిచేస్తుంటారు. అయితే వీరికి శ్రమకు తగ్గ ఆదాయం అందదు. వీరి ఆదాయంలో కంపెనీలు 20 నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటాయి. దాంతోపాటు వీళ్లకు కంపెనీల నుంచి ఎలాంటి ఇతర బెనిఫిట్స్, సామాజిక భద్రత వంటివి ఉండవు. అందుకే వీరిని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లు తీసుకొచ్చారు.

బిల్లులోని అంశాలు
గిగ్ వర్కర్ల బిల్లులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు వంటివి ఏర్పాటు చేస్తారు. ఇందులో గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ వంటి బాధ్యతలు చేపడతారు. బిల్లులో ఏయే అంశాలు ఉండాలి అన్నదానిపై ముందుగానే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. వర్కర్ల నుంచి సూచనలు, అభ్యంతరాలు అందగా.. వాటిని పరిగణలోకి తీసుకుని బిల్లు అమలు చేశారు.
వర్కర్లకు ఉండే బెనిఫిట్స్
ఈ బిల్లు ద్వారా ముఖ్యంగా డెలివరీ జాబ్స్ చేసేవాళ్లకు మంచి బెనిఫిట్స్ అందనున్నాయి. ఇకపై వర్కర్లు డెలివరీ ఫ్లాట్ఫామ్స్ కు చెల్లించే సొమ్ములో 1- నుంచి 2 శాతం వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి వెళ్తుంది. అలాగే ప్లాట్‌ఫామ్‌లు చెల్లింపులు సక్రమంగా చేస్తున్నాయా? లేదా? అనేది పర్యవేక్షించేందుకు రియల్-టైమ్ వెరిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించే ప్లాట్‌ఫామ్‌లకు చట్టప్రకారం ఫైన్ వేస్తారు.
గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్
ఇకపోతే స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, జెప్టో, బ్లింకిట్ వంటి ప్లాట్ ఫామ్‌లు, కార్మికుల మధ్య తలెత్తే వివాదాలను ఇన్టైంలో పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ను ఏర్పాటు చేయనుంది. అలాగే వంద కంటే ఎక్కువ మంది గిగ్ వర్కర్లు కలిగి ఉన్న కంపెనీలు అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
పెనాల్టీలు ఇలా..
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం నిబంధనలను పాటించని లేదా ఉల్లంఘించే సంస్థలకు (స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబర్ వంటివి) జరిమానా విధించబడుతుంది. ముఖ్యంగా సంక్షేమ రుసుము చెల్లించని ప్లాట్‌ఫారమ్‌లకు మొదటిసారి తప్పు చేస్తే రూ. 50,000 జరిమానా విధిస్తారు. మరోసారి అదే ఉల్లంఘనకు పాల్పడితే ఫైన్ రూ. 2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
నోటీసు ఇవ్వాలి
అంతకుముందు కంపెనీలు ఉన్నట్టుండి ఉద్యోగులను పని నుంచి తీసివేసేవి. ఇకపై అలా కుదరదు. ఎవరైనా ఉద్యోగిని తొలగించాలంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. వీటితోపాటు గిగ్ వర్కర్ల జీతాల చెల్లింపులో ఆలస్యం, అకౌంట్లు సస్పెండ్ చేయడం లేదా ఇతర మోసాల వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులు ఉంటారు.
ప్రస్తుతం గిగ్ వర్కర్ల పని కేటాయింపులు, బోనస్‌లు, రేటింగ్‌లు, అకౌంట్ సస్పెన్షన్‌ల వంటివి పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఆధారంగా నడుస్తున్నాయి. అయితే వీటిలో వివక్ష, అన్యాయానికి తావులేకుండా బిల్లులో 'అల్గారిథమ్ ట్రాన్సపరెన్సీ'ని తీసుకురాబోతున్నారు. అలాగే గిగ్ వర్కర్లు ఈ కమిటీల ద్వారా పరిష్కారం పొందలేకపోతే పైస్థాయిలో అప్పీలేట్ అథారిటీకి వెళ్లే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.
ఈ రాష్ట్రాల కూడా..
ఈ తరహా బిల్లుని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతోంది. అయితే గతంలో కర్నాటక, రాజస్తాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ఈ తరహా బిల్లు గురించి సమావేశాలు జరిపాయి. కానీ, బిల్లు రూపంలో అమలు కాలేదు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications