లండన్: వేల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడి, దేశం విడిచి బ్రిటన్‌కు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ.. మరోసారి వార్తల్లోకెక్కారు. తనను భారత్‌కు పంపించడానికి అనుకూలంగా బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని సవాల్ చేశారు. బ్రిటన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పౌరసత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తనను భారత్‌కు పంపించడానికి వీలుగా ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఇటీవలే అనుమతి ఇచ్చిన ప్రతిపాదనలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.
తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా ఆదేశాలను జారీ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసగించిన కేసులో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు. కేసులు నమోదైన వెంటనే ఆయన దేశం విడిచి పారిపోయారు. బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై కేసు నమోదు చేశాయి. విచారణ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం విజ్ఙప్తి మేరకు బ్రిటన్ పోలీసులు నీరవ్ మోడీని అదుపులోకి తీసుకున్నారు.

బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విచారణలో భాగంగా నీరవ్ మోడీని స్వదేశానికి రప్పించడానికి సీబీఐ అధికారులు తరచూ సంప్రదింపులను చేస్తోన్నారు. ఈ క్రమంలో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలంటూ బ్రిటన్ న్యాయస్థానం ఈ ఏడాది ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చింది. దీనికి అనుగుణంగా ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ కిందటి నెల ఆమోద ముద్ర వేసింది.
తాజాగా నీరవ్ మోడీ దీనిపై అప్పీల్‌కు వెళ్లారు. బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ తనను భారత్‌కు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ అప్పీల్ చేశారు. తన మానసిక స్థితి, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను రూపొందించిందని పేర్కొన్నారు. స్వదేశానికి అప్పగించాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలను ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications