Petrol pump: బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. పెట్రోల్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందంటే..

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన పెట్రోల్ కొరత ఇప్పుడు తెలంగాణకు తాకింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెట్రోల్ బంక్ (petrol bunk) ల దగ్గర "నో స్టాక్" బోర్డులు దర్శనమిస్తున్నాయి. అసలు పెట్రోల్, డీజిల్ ఎందుకు దొరకడం లేదు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? సామాన్య వాహనదారులు పడుతున్న ఇబ్బందులేంటో ఈ కథనంలో వివరంగా చూద్దాం.

Fuel Shortage In Telangana 25 Percent Of petrol pump Stations Closed Due To West Asia Conflict

రూల్ మార్చిన చమురు కంపెనీలు

పశ్చిమ ఆసియాలో (ఇరాన్-అమెరికా) జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో మార్పులు వచ్చాయి. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అందించిన సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని సుమారు 25 శాతం పెట్రోల్ బంకులు సప్లై లేక తాత్కాలికంగా మూతపడ్డాయి. గతంలో చమురు కంపెనీలు పెట్రోల్ పంప్ (petrol pump) డీలర్లకు పెట్రోల్ పంపిన తర్వాత, సాయంత్రం లేదా మరుసటి రోజు డబ్బులు కట్టే వెసులుబాటు ఇచ్చేవి. కానీ ఇప్పుడు యుద్ధ భయాల వల్ల "ముందు పైసలు కడితేనే ట్యాంకర్ పంపిస్తాం" అని కండిషన్ పెడుతున్నాయి.

డబ్బులు కట్టినా ట్యాంకర్లు రావట్లేదా?

డీలర్లు చెబుతున్న మాట ప్రకారం.. లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా కట్టినప్పటికీ, ట్యాంకర్లు రావడానికి రెండు మూడు రోజులు సమయం పడుతోంది. ఉదాహరణకు, కోదాడలో ఒక బంక్ మేనేజర్ రూ. 25 లక్షలు చెల్లించినా, మూడు రోజుల వరకు పెట్రోల్ రాకపోవడంతో బంక్ మూసేయాల్సి వచ్చింది. ఇలా వారంలో రెండు మూడు రోజులు బంకులు మూతపడితే నిర్వహణ ఖర్చులు భరించడం కష్టమని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వారంలో రెండు రోజులు బంక్ మూసి ఉంచితే, నెలకు ఎనిమిది రోజులు వ్యాపారం దెబ్బతింటుంది, దీనివల్ల డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఎక్కడెక్కడ ప్రభావం ఎక్కువగా ఉంది?

హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. చాలా చోట్ల వాహనదారులు పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. మరికొన్ని చోట్ల లారీలు డీజిల్ లేక హైవేల పక్కనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • హైదరాబాద్: హిమాయత్‌నగర్ వంటి కొన్ని ప్రధాన ప్రాంతాల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించాయి.
  • ఖమ్మం & భద్రాద్రి: ఇక్కడ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మణుగూరు, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వినాయకపురం స్టేషన్ దగ్గర జనం బారులు తీరారు.
  • సూర్యాపేట: ఈ జిల్లాలో దాదాపు 15 బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. మద్దిరాల మండలంలో మూడు రోజులుగా ఇంధన సరఫరా నిలిచిపోయింది.

మున్ముందు ఎలా ఉండబోతోంది?

ప్రస్తుతానికి ఈ కొరత కేవలం పేమెంట్ విధానంలో వచ్చిన మార్పులు , సరఫరా గొలుసు (supply chain) లో అంతరాయం వల్లనే అని తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్లు డిస్పాచ్ కావడంలో జరుగుతున్న ఆలస్యం వల్లే ఈ సమస్య తలెత్తింది. అయితే యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే, ముడిచమురు ధరలు పెరిగి మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు తమ వాహనాల్లో ఇంధనం నిండుకోకముందే జాగ్రత్త పడటం మంచిది. ప్రభుత్వం జోక్యం చేసుకుని సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+