నిన్న రికార్డ్ గరిష్టానికి చేరుకున్న తర్వాత... పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు
నిన్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న అనంతరం నేడు (జూన్ 17) ఎలాంటి మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను యథాతథంగా ఉంచాయి. నిన్న పెట్రోల్ లీటర్ 25 పైసలు, డీజిల్ 13 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సవరిస్తాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలు దాటాయి. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర బుధవారం రూ.107.79, లీటర్ డీజిల్ ధర రూ.100.51గా ఉంది. గత 44 రోజుల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇరవై ఐదుసార్లు పెరిగాయి. దేశీయ చమురురంగ కంపెనీలు ఇంధన ధరలను నేడు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

ఈ పెరుగుదలతో ఈ 44 రోజుల కాలంలో పెట్రోల్ ధర లీటర్ పైన రూ.6.26, డీజిల్ లీటర్ పైన రూ.6.68 పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.66, లీటర్ డీజిల్ రూ.87.41కి పెరిగింది. బెంగళూరులో కూడా పెట్రోల్ రూ.100కు సమీపంలో ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.102.82, లీటర్ డీజిల్ రూ.94.84గా ఉంది.
ముంబై, రత్నగిరి, పర్బానీ, ఔరంగాబాద్, జైసల్మేర్, గంగానగర్, బాన్స్‌వాడా, ఇండోర్, భోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, చిక్‌మగ్‌లూరు, శివమొగ్గ, హైదరాబాద్, లెహ్ ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 క్రాస్ చేసింది.


Click it and Unblock the Notifications