పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 19, 2022) స్థిరంగా ఉన్నాయి. ధరలు . మే 21వ తేదీన కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో వాహన వినియోగదారులకు భారీ ఊరట దక్కింది. అంతకుముందు దీపావళికి ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 దిగువన ఉన్నాయి. మన వద్ద రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించకపోవడంతో రూ.110 వద్ద ఉన్నాయి.
నేడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.28, లీటర్ డీజిల్ రూ.102.63, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, లీటర్ డీజిల్ రూ.94.24, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, లీటర్ డీజిల్ రూ.92.75గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, లీటర్ డీజిల్ రూ.97.82, విశాఖలో లీటర్ పెట్రోల్ రూ.111.28, లీటర్ డీజిల్ రూ.98.86గా ఉంది.

దేశీయ చమురు రంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల చమురు ధరలు భారీగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ నేడు 116 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడాయిల్ 119 డాలర్లకు పైన ఉంది. అయినప్పటికీ మన వద్ద ధరలు గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్నాయి.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications