Petrol, diesel prices today: కొత్త ఏడాదిలో స్థిరంగా పెట్రోల్ ధరలు

దీపావళి తర్వాత దాదాపు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆంగ్ల నూతన సంవత్సరం 2022 జనవరి 1న కూడా అలాగే ఉన్నాయి. చమురు ధరలు శనివారం (జనవరి 1) కూడా అలాగే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి.

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం తగ్గింపు పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 మాత్రమే వర్తిస్తోంది. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.

Fuel prices today: Petrol and Diesel prices today 1 January 2022

ఒమిక్రాన్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. భారీగా పెరుగుతూ, అంతేస్థాయిలో పడిపోతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గగానే ఇక్కడ తగ్గవు. సగటు ద్వారా తగ్గింపు వర్తిస్తుంది. అయితే ఇటీవల అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నందున ఇక్కడ త్వరలో పెరగవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం చమురు మార్కెట్ పైన ఉంటోంది. వినియోగం తగ్గుతుందనే భయంతో చమురు ధరలు ప్రారంభంలో పడిపోయాయి. ఆ తర్వాత భారీగా పెరిగాయి. ఆగస్ట్ నెల నుండి ఓ వారంలో గరిష్ట పెరుగుదలను ఈ నెలలో ఇటీవల నమోదు చేశాయి. ఓ విధంగా ఊగిసలాటలో ఉన్నాయి.

చమురు ధరలు సోమవారం భారీగా ఎగిశాయి. క్రూడ్ ధరలు నవంబర్ చివరి నుండి మొదటిసారి 2 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 78.60 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 75.57 డాలర్ల వద్ద ఉంది.

Fuel prices today: Petrol and Diesel prices today 1 January 2022

ఇటీవలి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు భారత్‌లో చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడం దేశీయంగా ధరలపై ప్రభావం చూపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తగ్గించడంతో సామాన్యుడిపై కాస్త భారం తగ్గింది. అయితే ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతి తక్కువగా ఏ దేశంలో, ఎంత ఉన్నాయో తెలుసా? వెనిజులాలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యంత చౌక. డిసెంబర్ 6వ తేదీన లీటర్ పెట్రోల్ ఇక్కడ రూ.1.885 (మన భారత కరెన్సీలో).

ప్రపంచంలోనే గ్యాసోలైన్‌ను చౌకకు అందించే దేశం ఇది. ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.3.866గా ఉంది. ప్రపంచంలో చౌక ధరకు అందించే రెండో దేశం ఇది. ఇక, ప్రపంచంలోనే ఎక్కువ ధర ఉన్న దేశం హాంగ్‌కాంగ్. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ రూ.195.113. ఆ తర్వాత నెదర్లాండ్స్‌లో రూ.170.7. అమెరికాలో లీటర్ పెట్రోల్ ధర భారత కరెన్సీలో రూ.74.021. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్యాసోలైన్ ధర సగటున లీటర్‌కు రూ.90.83గా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+