కాస్త రిలీఫ్: వివిధ నగరాల్లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
వాహన వినియోగదారులకు నేడు ఊరట! పెట్రోల్, డీజిల్ ధరల్లో సోమవారం ఎలాంటి మార్పులేదు. వరుసగా రెండో రోజు ధరల్లో మార్పులేదు. దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం గం.6 సమయానికి పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా సవరణ ఉంటుంది. 92249 92249 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించి పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవచ్చు. పలు నగరాల్లో ఇప్పటికే ధరలు రూ.100 దాటాయి. రెండు రోజులుగా ధరల్లో మార్పులేదు.
వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.90.58, లీటర్ డీజిల్ రూ.80.97, ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97, లీటర్ డీజిల్ రూ.88.06, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.92.59, డీజిల్ రూ.85.98, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.91.78, డీజిల్ రూ.84.56, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.18, డీజిల్ రూ.88.31, బెంగళూరులో పెట్రోల్ రూ.93.61, డీజిల్ రూ.85.84గా ఉంది. పెట్రోల్ కొన్ని ప్రాంతాల్లో రూ.100 దాటింది. శ్రీగంగానగర్‌లో రూ.101.22, అన్నుపూర్‌లో రూ.100.98గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ 62.72 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ క్రూడ్ 59.80 పలికింది. బ్రెంట్ క్రూడ్ రూ.65 టార్గెట్‌ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్ల్యుటీఐ క్రూడ్ 63 డాలర్లకు చేరుకోవచ్చు.


Click it and Unblock the Notifications