పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 21, మంగళవారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఎక్స్చైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లీలో రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది.
చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ ఇంధన అవసరాలలో 80 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నాయి. అయితే కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల చమురు మార్కెటింగ్ సంస్థలకు లీటర్ పెట్రోల్ పైన రూ.13.08, డీజిల్ పైన రూ.24.09 నష్టం వాటిల్లుతోంది. అందుకే చమురు మార్కెటింగ్ సంస్థలు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించలేమని ప్రయివేటు పెట్రోల్ పంప్స్ రిటైల్ డీలర్స్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ అంశంపై కేంద్ర చమురు శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర చమురు శాఖకు జియో-బీపీ, నయారా ఎనర్జీ, షెల్ తదితర రిటైల్ డీలర్లతో కూడిన భారత పెట్రోలియం పరిశ్రమ సమాఖ్య (FIPI) జూన్ 10వ తేదీన లేఖ రాసింది. FIPI ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలను తన సభ్యులుగానే భావిస్తుంటుంది. లీటర్ డీజీల్‌పై రూ.20 నుండి రూ.25, లీటర్ పెట్రోల్‌పై రూ.14 నుండి రూ.18 నష్టానికి విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..



Click it and Unblock the Notifications