పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూలై 07, గురువారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఎక్స్చైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లీలో రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, లీటర్ డీజిల్ రూ.97.82గా ఉంది.
దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. ఇటీవల చమురు రంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ పైన నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలు అయితే ప్రభుత్వమే నష్టాన్ని భరిస్తుంది. అయితే కొన్ని ప్రయివేటు కంపెనీలు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం ధరలను స్వల్పంగా పెంచాయి. ప్రభుత్వరంగ పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 ఉంటే, ప్రయివేటు పెట్రోల్ బంకుల్లో రూ.5 పెంచి, రూ.115 వరకు తీసుకుంటున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్‌ను తగ్గించారు. దీంతో మహారాష్ట్రలో ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.111.13కు, లీటర్ డీజిల్ ధర రూ.97.28గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు 100 డాలర్లకు దిగువకు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం 120 డాలర్ల స్థాయికి కూడా చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 99.52 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 97056 డాలర్ల వద్ద కదలాడుతోంది.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications