పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూలై 04, సోమవారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఎక్స్చైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లీలో రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, లీటర్ డీజిల్ రూ.97.82గా ఉంది.
దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. ఇటీవల చమురు రంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ పైన నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలు అయితే ప్రభుత్వమే నష్టాన్ని భరిస్తుంది. అయితే కొన్ని ప్రయివేటు కంపెనీలు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం ధరలను స్వల్పంగా పెంచాయి. ప్రభుత్వరంగ పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 ఉంటే, ప్రయివేటు పెట్రోల్ బంకుల్లో రూ.5 పెంచి, రూ.115 వరకు తీసుకుంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు 110 డాలర్లకు కాస్త అటు ఇటుగా కదలాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం 120 డాలర్ల స్థాయికి కూడా చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ క్రితం సెషన్‌లో 2.45 డాలర్లు ఎగిసి 111.48 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధర 2.70 డాలర్లు ఎగిసి 108.46 డాలర్ల వద్ద కదలాడుతోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications