పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 22, బుధవారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఎక్స్చైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లీలో రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది.
చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ ఇంధన అవసరాలలో 80 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నాయి. అయితే కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల చమురు మార్కెటింగ్ సంస్థలకు లీటర్ పెట్రోల్ పైన రూ.13.08, డీజిల్ పైన రూ.24.09 నష్టం వాటిల్లుతోంది. అందుకే చమురు మార్కెటింగ్ సంస్థలు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించలేమని ప్రయివేటు పెట్రోల్ పంప్స్ రిటైల్ డీలర్స్ కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ అంశంపై కేంద్ర చమురు శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర చమురు శాఖకు జియో-బీపీ, నయారా ఎనర్జీ, షెల్ తదితర రిటైల్ డీలర్లతో కూడిన భారత పెట్రోలియం పరిశ్రమ సమాఖ్య (FIPI) జూన్ 10వ తేదీన లేఖ రాసింది. FIPI ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలను తన సభ్యులుగానే భావిస్తుంటుంది. లీటర్ డీజీల్‌పై రూ.20 నుండి రూ.25, లీటర్ పెట్రోల్‌పై రూ.14 నుండి రూ.18 నష్టానికి విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications