ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 26, శుక్రవారం) పెరిగాయి. చమురు రంగ కంపెనీలు వరుసగా 20వ రోజు ధరలను పెంచాయి. ఈ రోజు లీటర్ డీజిల్ పైన 17 పైసలు, లీటర్ పెట్రోల్ పైన 21 పైసలు పెరిగింది. లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు చమురురంగ సంస్థలు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్ష ప్రారంభించాయి. అప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి.
ఈ రోజుతో పెట్రోల్ ధర ఈ 20 రోజుల్లో రూ.8.81, డీజిల్ ధర రూ.10.80 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.13, లీటర్ డీజిల్ ధర రూ.80.19కి చేరుకుంది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87కు 9 పైసలు మాత్రమే తక్కువ ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.78.51గా ఉంది.

హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ. 83.18, డీజిల్ ధర రూ.78.36గా ఉంది. అమరావతిలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు అలాగే ఉన్నాయి. పెట్రోల్ రూ.83.53, డీజిల్ రూ.78.67గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ రూ.83.13, డీజిల్ ధర లీటర్ రూ.78.30గా ఉంది. 12 నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ రూ.80కి పైకి చేరుకుంది. జైపూర్, ఢిల్లీలలో లీటర్ డీజిల్ ధర రూ.80 కంటే పైకి కదలాడుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications