17వ రోజు పెట్రోల్ ధర పెరగలేదు, కానీ ఈ స్టాక్స్ దుమ్మురేపాయి.. ఎందుకంటే?

పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం(సెప్టెంబర్ 22) స్థిరంగా ఉన్నాయి. వరుసగా 17వ రోజు పెరగలేదు. క్రితంసారి ఇరవై రోజుల క్రితం స్వల్పంగా తగ్గాయి. అప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 19 పైసలు తగ్గి రూ.101.19, లీటర్ డీజిల్ పైన 15 పైసలు తగ్గి రూ.88.77 నుండి రూ.88.62గా ఉంది. నాటి నుండి ధరల్లో మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి పెరిగింది మాత్రం జూలై 17వ తేదీ. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఇటీవల తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. చివరిసారి జూలై నెలలో లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత ఆగస్ట్ నెలలో ధరలు ఒక్కసారి పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.19, లీటర్ డీజిల్ రూ.88.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.26, డీజిల్ రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.98.96, డీజిల్ రూ.93.26, కోల్‌కతాలో పెట్రోల్ రూ.101.62, డీజిల్ రూ.91.71, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.35, డీజిల్ రూ.96.85గాఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది.

 Fuel price today: Petrol, Diesel Prices Steady On Wednesday

పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.

బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 75 డాలర్లకు (74.28 డాలర్లు) దిగువనే ఉంది. గతవారం చివరలో ఈ మార్కు పైన కదలాడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్‌కు 70.56 డాలర్ల వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ 1.75 శాతం క్షీణించగా, వెస్ట్ టెక్సాస్ 1.41 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గతవారంలో పెరిగాయి. అయితే ఇప్పుడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

కాగా, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1 నుండి పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ధరలను సవరించాయి. నాన్-సబ్సిడీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు రూ.25 పెంచాయి. నాన్-సబ్సిడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడు రూ.884.50కు పెరిగింది. గత రెండు వారాల్లో ఇది రెండో పెరుగుదల. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన, 15వ తేదీన సవరిస్తాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

ONGC షేర్లు జంప్

ఓఎన్జీసీ షేర్లు నిన్న భారీగా లాభపడ్డాయి. ఏకంగా 5 శాతం కంటే పైగా ఎగిసి రూ.135 వద్ద క్లోజ్ అయింది. బలమైన వృద్ధి అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్ లాభపడింది. ఇక ఆయిల్ ఇండియా షేర్ ధర కూడా 7 శాతం కంటే ఎక్కువగా లాభపడి రూ.209 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర నిన్న స్వల్పంగా తగ్గినప్పటికీ, ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. బ్రెంట్ 75 డాలర్లకు దిగువకు వచ్చినప్పటికీ అక్కడే కదలాడుతోంది. ఈ నేపథ్యంలో డిమాండ్ అంచనాలు కనిపిస్తుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+