జూన్ నెలలో భారత్‌లో ఇంధన డిమాండ్ పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్, కరోనా నిబంధనలు కఠినంగా విధించాయి. సెకండ్ వేవ్ తగ్గడంతో లాక్ డౌన్‌ను సడలించాయి ప్రభుత్వాలు. దీంతో జూన్ నెలలో పెట్రోల్, డీజిల్ వినియోగం పెరిగింది. మే నెలలో ఇంధన వినియోగం తొమ్మిది నెలల కనిష్టానికి చేరుకున్న తర్వాత ఇప్పుడు పెరగడం గమనార్హం. మే నెలతో పోలిస్తే ఇంధన వినియోగం 8 శాతం పుంజుకుంది. గత నెలలో 16.34 మిలియన్ టన్నుల ఇంధన వినియోగం నమోదయినట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(PPAC) పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాహన రాకపోకలు, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. గత ఏడాది ఆగస్ట్ తర్వాత మొదటిసారి మే నెలలో ఇంధన వినియోగం అతి తక్కువగా నమోదయింది. జూలై నెలలో ఇంధన వినియోగం గత ఏడాదితో పోలిస్తే 1.5 శాతం పెరిగింది. దేశీయ రిఫైండ్ ఫ్యూయల్ సేల్స్‌లో దాదాపు నలభై శాతంగా ఉన్న డీజిల్ వినియోగం మే నెలలో 1.6 శాతం తగ్గి 6.20 మిలియన్ టన్నులు నమోదు కాగా, జూన్ నెలలో 12 శాతం పెరిగింది.

2020 జూన్ నెలతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 5.7 శాతం పెరిగింది. మే నెలతో పోలిస్తే 21 శాతం పెరిగి 2.41 మిలియన్ టన్నులకు చేరుకుంది. వంట గ్యాస్ వినియోగం 9.7 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నుల వద్ద స్థిరపడింది. నాఫ్తా సేల్స్ 3.1 శాతం తగ్గి 1.19 మిలియన్ టన్నులకు పడిపోయింది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications