FSSAI News: ఇటీవల దేశంలోని ప్రముఖ స్పైసెస్ కంపెనీలకు చెందిన మసాలా ఉత్పత్తులపై కొన్ని దేశాల్లో చర్యలు తీసుకోబడ్డాయి. స్థానిక అధికారుల పరిశీలనలో పురుగుందు అవశేషాలతో పాటు హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు నివేదికలు రావటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ ఫుడ్ సేఫ్టీ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా దర్యాప్తును ప్రారంభించింది.
తాజాగా ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) హెర్బ్స్ అండ్ స్పైసెస్‌లో అధిక స్థాయిల్లో పురుగుమందుల అవశేషాలను అనుమతించినట్లు మీడియా నివేదికలను ఖండించింది. ఆ నివేదికలు పూర్తిగా తప్పుడు, హానికరమైనవిగా పేర్కొంది. భారత్ ప్రపంచంలో అత్యంత కఠినమైన గరిష్ఠ అవశేషాల పరిమితి(MRL) ప్రమాణాలను పాటిస్తున్న దేశాల్లో ఒకటిగా పేర్కొంది. FSSAI రిస్క్ అసెస్‌మెంట్ ఆధారంగా వివిధ ఆహార పదార్థాలకు పురుగుమందుల MRLలు వేర్వేరుగా నిర్ణయించబడతాయని పేర్కొంది.

భారతదేశంలో క్రిమిసంహారక చట్టం 1968 ప్రకారం ఏర్పడిన సెంట్రల్ పెస్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ ద్వారా వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoA&FW) ద్వారా నియంత్రించబడుతుందని FSSAI తెలిపింది. పురుగుమందుల తయారీ, దిగుమతులు, రవాణా, నిల్వ, క్రిమిసంహారకాలను తదనుగుణంగా నియంత్రించబడతాయి. ఈ క్రమంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ పురుగుమందుల అవశేషాలపై సైంటిఫిక్ ప్యానెల్ CIB & RC ద్వారా స్వీకరించబడిన డేటాను పరిశీలిస్తుంది.
దేశంలో CIB&RC ద్వారా నమోదు చేయబడిన మొత్తం పురుగుమందుల సంఖ్య 295 కంటే ఎక్కువే. వాటిలో 139 పురుగుమందులు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఉపయోగం కోసం నమోదు చేయబడ్డాయి. కోడెక్స్ మొత్తం 243 పురుగుమందులను స్వీకరించింది. వాటిలో 75 పురుగుమందులు సుగంధ ద్రవ్యాలకు వర్తిస్తాయి. ఉదాహరణకు.. రిస్క్ అసెస్‌మెంట్ డేటా ఆధారంగా బియ్యం 0.03 mg/kg, సిట్రస్ పండ్లు 0.2 mg/kg, కాఫీ గింజలు 0.1 mg/kg, యాలుకలకు 0.5 mg/kg, మిరపకాయ 0.2 mg/kg MRLలు కలిగిన అనేక పంటలపై మోనోక్రోటోఫాస్‌ను ఉపయోగించడం అనుమతించబడుతుంది.


Click it and Unblock the Notifications