భారత సిలికాన్ సిటీ బెంగళూరు రోడ్లపై రోజూ కనిపించే ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలామందికి చిరాకు తెప్పిస్తుంటాయి. అయితే అదే చిరాకు ఒక వినూత్న ఆవిష్కరణకు దారి తీస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలానే జరిగింది. ట్రాఫిక్ నిబంధనలను లెక్కచేయని డ్రైవర్లతో విసిగిపోయిన బెంగళూరుకు చెందిన ఒక టెక్నీషియన్ హెల్మెట్ ని సరికొత్తగా మలిచాడు. తన సాధారణ హెల్మెట్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఒక రకమైన కదిలే ట్రాఫిక్ పోలీసుగా మార్చేశాడు.
టెక్నాలజీ రంగంలో పని చేసే పంకజ్ తన్వర్ ప్రతిరోజూ రోడ్డుపై జరుగుతున్న నిర్లక్ష్య డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణాలు, స్టంట్ డ్రైవింగ్ వంటి దృశ్యాలను చూసి తీవ్రమైన అసహనం వ్యక్తం చేశాడు. నేను రోడ్డుపై ఉన్న తెలివితక్కువ ప్రవర్తనతో విసిగిపోయాను. అందుకే ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నానని అతను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారి తీశాయి.

తన్వర్ రూపొందించిన AI హెల్మెట్‌లో ఒక కెమెరా,కంప్యూటర్ విజన్ అల్గోరిథమ్స్, రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ వ్యవస్థ ఉన్నాయి. అతను బైక్ నడుపుతున్న సమయంలో.. ఈ హెల్మెట్ తన చుట్టూ జరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను గమనిస్తుంది. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ప్రమాదకర స్టంట్ డ్రైవింగ్, ఇతర నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి, వాటిని ఫ్లాగ్ చేస్తుంది. అంతేకాదు, ఆ ఉల్లంఘన జరిగిన స్థలం, సమయం, దృశ్య ఆధారాలతో కూడిన సమాచారం సిద్ధం చేస్తుంది.
ఈ AI Helmet ఆవిష్కరణను తన్వర్ సోషల్ మీడియా వేదిక Xలో ఒక వీడియో రూపంలో పంచుకున్నాడు. ఆ వీడియోలో హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్న వ్యక్తిని AI గుర్తించిన దృశ్యాలు, అలాగే రోడ్డుపై ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్న కారు సన్నివేశాలు కనిపించాయి. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారి, రెండు మిలియన్లకు పైగా వీక్షణలను సాధించింది.
సోషల్ మీడియా వినియోగదారుల స్పందనలు మిశ్రమంగా ఉన్నాయి. కొందరు ఇది అద్భుతమైన ఆలోచన, ప్రజలే ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములైతే పరిస్థితి మారుతుందని ప్రశంసించారు. మరికొందరు మాత్రం ఇలా ప్రజలే పర్యవేక్షిస్తే గోప్యత సమస్యలు తలెత్తవచ్చు అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. ఇంకొందరు ఇది ఒక ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు.
ఇక ఈ కథలో ముఖ్యమైన మలుపు ఏమిటంటే...బెంగళూరు సిటీ పోలీసులు స్వయంగా తన్వర్‌ను సంప్రదించడం. అతని పోస్టును గమనించిన పోలీసులు.. ఈ ఆలోచన రోడ్డు భద్రత కోణంలో వినూత్నంగా ఉందని ప్రశంసించారు. హెల్మెట్ ఆధారిత ట్రాఫిక్ ఉల్లంఘన గుర్తింపు అనేది ఆసక్తికరంగా ఉంది అంటూ పంపిన సందేశం స్క్రీన్‌షాట్‌ను తన్వర్ గర్వంగా పంచుకున్నాడు.
ఓఎంజీ! Bengaluru పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి మాకు మెసేజ్ వచ్చిందంటూ అతను స్పందించాడు. ఒక సాధారణ వ్యక్తి అసహనంతో మొదలైన ప్రయోగం, ఇప్పుడు అధికారిక స్థాయిలో చర్చకు రావడం ఈ కథను ప్రత్యేకంగా నిలబెట్టింది.క్లుప్తంగా చెప్పాలంటేఇది కేవలం ఒక హెల్మెట్ కథ కాదు. టెక్నాలజీ సరిగ్గా ఉపయోగిస్తే.. సామాన్య పౌరుడు కూడా మార్పుకు కారణం కావచ్చని చూపించే ఉదాహరణ.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

Layoffs: భవిష్యత్తులో ప్రోగ్రామర్ల అవసరం తగ్గుతుందా? ఏఐ కంపెనీలు ఏమంటున్నాయంటే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications