భారతదేశంలో పండుగల సమయంలో గిఫ్ట్‌లు ఇవ్వడం ఇప్పుడు కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు షాపింగ్, వినియోగాన్ని పెంచే ఒక ముఖ్యమైన కారణంగా మారింది. ఇప్పుడు ప్రజలు సస్టైనబుల్, ఉపయోగకరమైన గిఫ్ట్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు వెల్‌నెస్ కిట్లు, ల్యాబ్‌లో తయారైన డైమండ్ జ్యువెలరీ వంటి గిఫ్ట్‌లు ఈ సీజన్‌లో ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా గిఫ్టింగ్ ట్రెండ్ మారడం వల్ల రీటైల్, జీవన శైలి, లగ్జరీ బ్రాండ్లు కూడా కొత్తగా ఆలోచించి కస్టమర్లకు మరింత ప్రత్యేక అనుభవం అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.
వెల్‌నెస్ బ్రాండ్ "Nat Habit" కో-ఫౌండర్ స్వాగతిక దాస్ చెబుతున్నదేమిటంటే పండుగలలో మునుపు సుమారు 70-80% గిఫ్ట్‌లు సౌకర్యం కోసం మాత్రమే ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సుమారు 60% మంది వెల్‌నెస్, వ్యక్తిగత అనుభవం ఇచ్చే గిఫ్ట్‌లను ఎంచుకుంటున్నారు. పర్యావరణహితంగా, ప్రీమియం లుక్ ఉన్న గిఫ్టింగ్ కిట్లు, రీటైల్ బాక్స్‌లు ఇప్పుడు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి.

Self-care ఇప్పుడు కేవలం వ్యక్తిగతమైన విషయం కాదు. అది ప్రేమ, శ్రద్ధ, సంబంధాలను వ్యక్తపరిచే ఒక మార్గంగా మారింది. అందుకే వెల్‌నెస్ ఉత్పత్తులు, క్యూట్‌గా క్యూయరేట్ చేసిన కిట్లు, ప్రత్యేకంగా తయారు చేసిన గిఫ్ట్‌లు ఇప్పుడు సాధారణ గిఫ్ట్‌ల కంటే ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయి. గిఫ్టింగ్ ఇప్పుడు ఒక భావోద్వేగ అనుభవం, అనుబంధాన్ని పెంచే మార్గంగా మారింది.
పండుగ సీజన్‌లో లైఫ్స్టైల్ మరియు లగ్జరీ బ్రాండ్లు మంచి అమ్మకాల వృద్ధిని చూస్తున్నాయి. ఫ్రిడో కంపెనీ కో-ఫౌండర్ గణేష్ సోనవానే "ఈ పండుగ సీజన్‌లో మా వెబ్‌సైట్‌కి వచ్చే ట్రాఫిక్ 28% పెరిగింది. అలాగే, కొనుగోళ్ల సంఖ్య 18% పెరిగింది. ఈ వేగం ఇలానే కొనసాగితే, ఈ త్రైమాసికం చివరికి గత సంవత్సరం పండుగ అమ్మకాల కంటే సుమారు 40% ఎక్కువ వృద్ధిని సాధిస్తామని భావిస్తున్నాం అని చెప్పారు. అంటే, పండుగ సీజన్‌లో వినియోగదారుల ఉత్సాహం బ్రాండ్లకు మంచి వ్యాపార అవకాశాలను తీసుకువస్తోంది.
Solitario CEO రికీ వాసందాని "ఇప్పటి వినియోగదారులు కేవలం అందంగా కనిపించే జ్యువెలరీనే కాకుండా, బాధ్యతతో తయారైన వాటినీ ఇష్టపడుతున్నారు. ల్యాబ్‌లో తయారయ్యే డైమండ్లు సహజ రాళ్లలా మెరుస్తాయి. అదేకాకుండా, ఇవి పర్యావరణానికి హితంగా, అందుబాటులో ఉండే ధరల్లో, ఆధునిక విలువలను చూపించేలా ఉంటాయి. ముఖ్యంగా యువత (మిల్లెనియల్స్) జ్యువెలరీని ఇప్పుడు తమ వ్యక్తిత్వాన్ని, అభిరుచిని చూపించే ఒక ప్రత్యేక మార్గంగా చూస్తున్నారు. ఇది ఇక పెళ్లిళ్లు లేదా ప్రత్యేక సందర్భాలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత విలువలు, స్టైల్‌ని వ్యక్తపరచే సాధనంగా మారింది అని చెప్పారు.
గిఫ్టింగ్ ఎకానమీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. CAIT సెక్రటరీ జనరల్ & చాందిని చౌక్ MP, ప్రభీన్ ఖాండెల్‌వాల్ అంచనా ప్రకారం, కర్వా చౌత్ వ్యాపారం దేశవ్యాప్తంగా సుమారు రూ. 28,000 కోట్లు, దిల్లీ నుండి రూ. 8,000 కోట్లు. ఇది 2024 లో రూ. 22,000 కోట్లు, 2023 లో రూ. 15,000 కోట్లు నుండి పెరిగింది. మొత్తం మీద ఈ పండుగల సీజన్‌లో గిఫ్టింగ్ కేవలం ఉత్పత్తులు కొనుగోలు చేయడం కాదు, అనుభవాన్ని, విలువను, మరియు వ్యక్తిగతతను ప్రాధాన్యంగా తీసుకోవడం వైపు వినియోగదారుల దృష్టిని మార్చింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications