దుబాయ్‌లో అరటి పండు దొరకలేదని ఉద్యోగం వదిలేశాడు, కట్ చేస్తే ఆ దేశానికే దాని రుచి చూపిస్తూ..

చాలా మంది సక్సెస్ స్టోరీల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం మనసులో విజయాన్ని సాధించాలనే తపనను కలిగిస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే దానికి ప్రేరణగా నిలుస్తుంది. ఇలాంటి కథలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కథ కూడా అదే.. దుబాయ్ లో అరటి పండు దొరకలేదని ఏకంగా ఉద్యోగాన్ని వదిలేశాడు. వ్యాపారం వైపు ఆలోచనను మళ్లించాడు. ఇప్పుడు ఏకంగా కోట్లాది రూపాయల టర్నోవర్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. బిజేష్ కృష్ణ.. సేంద్రీయ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న యువ రైతు సక్సెస్ స్టోరీ ఈ వారం మీకోసం..

కేరళలోని మాలాలో గల కొత్తవతిల్‌కు చెందిన బిజేష్ కృష్ణ దుబాయ్‌లో అకౌంటెంట్‌గా ఒక దశాబ్దం పాటు పనిచేశాడు. ఆ సమయంలో దుబాయ్ లో జరిగిన ఓ వేడుకలో అరటిపండు దొరకక చాలా ఇబ్బంది పడ్డాడు. కేరళ సాంప్రదాయ విందులో భాగమైన అరటిపండు దొరకకపోవడం అతనిలో చాలా నిరాశను కలిగించింది. దుబాయ్ మార్కెట్లలో ఎక్కడ కూడా అరటిపండ్లు దొరకకపోవడంతో ఇంక నిరాశ చెందాడు. ఆ చిన్న నిరాశే అతనికి పెద్ద ఆలోచనను రేకెత్తించింది. గల్ఫ్ దేశాలకు కేరళ నుంచి మేమే అరటిపండ్లను ఎగుమతి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు.

Kerala organic farming success Kerala to Dubai export story organic vegetable business Indian farmer success story Kerala entrepreneur UAE market Rs 2 crore farming business Indian exports to Dubai organic vegetables export Kerala agribusiness startup story Kerala farmer India UAE agriculture trade green business success 2 success Story success Storys Kerala success Story vegetable farmer success Story Bijesh Krishna Bijesh Krishna Farmer

ఆలోచన రావడమే ఆలస్యం..చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి దుబాయ్ ని వదిలి సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చాడు. వివిధ రకాల కూరగాయలను పండించడానికి రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందరిలా కాకుండా ఢిఫరెంట్ గా చేయాలనుకుని సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాడు. అయితే సేంద్రీయ వ్యవసాయం అంటే బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వ్యాపారంలో ముందడుగు పడలేదు. తన శ్రమకు తగిన ప్రతిఫలం పొందలేకపోవడంతో ఎలాగైనా తన ఉత్పత్తులకు కొత్త మార్కెట్‌ను కనుగొనాలని నిర్ణయించుకున్నాడు.

అప్పుడే దుబాయ్ కి ఎగుమతులు చేయాలనే ఆలోచన వచ్చింది. విదేశాల్లోని మలయాళీలలో సేంద్రీయ కూరగాయలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుందని తెలుసుకున్నాడు. వెంటనే దుబాయ్ లో తన స్నేహితులను కలిసి ముందుగా ఫర్టిలైజర్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించాడు. అయితే అక్కడ చెల్లింపు సమస్యలు ఇబ్బందిపెట్టాయి. పైగా రాబడి కనపడలేదు. దీంతో అక్కడే వేరే మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పైగా తన సోదరుడు కూడా అక్కడే ఉండటంతో సేంద్రీయ ఉత్పత్తులను ఎగుమతులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అప్పుడు కూడా అతన్ని సమస్యలు వెంటాడాయి. మొదట సేంద్రీయ ఉత్పత్తులను ఇతరుల నుండి సేకరించేవాడు. అయితే నిజమైన సేంద్రీయ కూరగాయలను సేకరించడం కష్టతరంగా మారింది. ఏదీ సేంద్రీయ పద్దతుల్లో పండించారో మరేది ఎరువులతో పండించారో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ముందుగా దుబాయ్ లోని 35 కుటుంబాలకు సేంద్రీయ కూరగాయలను దాదాపు 160కిలోలు సేకరించి కేరళ నుండి పంపించారు. అక్కడ తన సోదరుడు వాటిని దుబాయ్ లోని ఆ ఇళ్లకు సరఫరా చేసేవాడు.

అప్పటి నుండి అతనికి తగిన గుర్తింపు వచ్చింది. కస్టమర్ల సంఖ్య పెరిగింది. 35 కుటుంబాల నుంచి ఇప్పుడు వేయి కుటుంబాలకు సరఫరా పెరిగింది. అయితే ఎగుమతి సమయంలో ఇతరుల మీద ఆధారపడిన బ్రిషేష్ తరువాత తానే వ్యవసాయంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. త్రిస్సూర్ లోని మాలా దగ్గర 1.5 ఎకరాల భూమి లీజుకు తీసుకుని కూరగాయలు పండించారు. ఇప్పుడు అది 8 ఎకరాలకు పైగా చేరుకుంది.

సేంద్రీయ ఎరువుల కోసం స్థానికుల నుంచి ఆవు పేడ, కోళ్ల వ్యర్థాలు వంటి వాటిని సేకరిస్తారు.రసాయన పురుగు మందులు జోలికి వెళ్లకుండా ఈ సేంద్రీయ ఎరువులతోనే వ్యవసాయం చేస్తారు. అయితే ఈ సేంద్రీయ ఎరువులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. 150 మిల్లీ మీటర్ల పురుగుమందులకు రూ. 250 ఖర్చు అయితే సేంద్రీయ ఎరువులకు రూ. 2500 ఖర్చు అవుతుంది. పైగా దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. సేంద్రీయ ఎరువుల పెంపకంలో తెగుళ్లను తట్టుకోవడం చాలా కష్టం. 60 కిలోల పంటలో దాదాపు 10 కిలోలు తెగుళ్ల ద్వారా కోల్పోవాల్సి వస్తుంది.

దీనికి పరిష్కార మార్గంగా ధరను ఎక్కువ పెంచి అమ్మాలని నిర్ణయం తీసుకున్నాడు.అయితే స్థానిక మార్కెట్లలో ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయరు కాబట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే దుబాయ్ ని ఎంచుకుని వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. అక్కడ ఇప్పుడు నేచర్ బీట్స్ ఆర్గానిక్స్ కింద స్టోర్ కూడా ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. ప్రతి వారం అరటిపండ్లతో సహా..ఇతర రకాల కూరగాయలను 2500 కిలోల నుండి 3500 కిలోల వరకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. వారానికి మూడు సార్లు దుబాయ్ కి ఎగుమతి చేస్తారు.

ఈ రోజు ఉత్పత్తులను మధ్యాహ్నానికి ప్యాకింగ్ చేసి విమానశ్రయానికి పంపితే వారు సాయంత్రానికి కార్గో విమానంలోకి పంపిస్తారు. రాత్రి వెళ్లే విమానాల్లో ఉదయానికి కల్లా దుబాయ్ చేరుకుంటుంది. అక్కడ ఉదయం 10 గంటల లోపు డెలివరీ చేయడం జరుగుతుందని వ్యాపారవేత్త చెబుతున్నారు. అందులో ఆర్డర్ పొందిన కస్టమర్లకు పంపగా మిగిలిన మొత్తాన్ని స్టోర్ రూంకి పంపిస్తారు. అక్కడ ఈ కూరగాయల ధరలు 8 దిర్హామ్ ల నుండి 15 దిర్హామ్ ల వరకు ఉంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 180 నుంచి రూ. 350 వరకు ఉంటుంది. గతేదాడి ఈ కంపెనీ మొత్తం టర్నోవర్ రూ. 2 కోట్లకు పెరిగింది. నెలవారీ ఆదాయం రూ. 16 లక్షలకు చేరుకుంది.

ఇక మరో విషయం ఏంటంటే కస్టమర్లకు నమ్మకంకిలిగించడానికి దుబాయ్ మార్కెట్లో సీసీ కెమెరాలు పెట్టడం.అలాగే వారు పండించే పొలంకి ఆ కెమెరాలు అనుసంధానం చేశారు. దీంతో దుబాయ్ కస్టమర్లు నేరుగా పొలంలో పండించే విధానం చూసి కొనుగోలు చేయవచ్చని బ్రిజేష్ తెలిపారు. అందరికీ ఇప్పుడు ఆయన ఇచ్చే సలహా ఏంటంటే.. నేరుగా వ్యాపారంలోకి దిగకుండా ముందుగా సోర్స్ ని వెతకండి..మార్కెట్ ని క్షుణ్ణంగా స్టడీ చేయండి. ఆ తర్వాతే వ్యాపారంలోకి ప్రవేశించండి.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+