Monday Market: ఈ వారం భారత మార్కెట్ల దృష్టి దానిపైనే.. ఇన్వెస్టర్స్ అత్యంత జాగ్రత్త..
Market Next Week: కొత్త నెల ప్రారంభం కావటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా ప్రయాణాన్ని కొనసాగిస్తాయనే ఆలోచన చాలా మంది ఇన్వెస్టర్లను వెంటాడుతున్న అంశం. అయితే రెండు రోజుల్లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడిదారులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఇది మార్కెట్లలో పెద్ద షేక్ క్రియేట్ చేసే అంశం. దీనికి తోడు కొత్త వారంలో మార్కెట్లను ప్రభావితం చేయనున్న వివిధ అంశాలపై కన్నేయాల్సి ఉంది.
నవంబర్ 5న అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు, వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల కార్యకలాపాలు, దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వంటి అంశాలు రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల దిశను నిర్ణయించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్ ట్రెండ్ చాలా కీలకంగా మారనుంది. రానున్న వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా ఎఫ్ఓఎంసీ డేటా కీలకమైవిగా స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రపంచ భౌగోళిక రాజకీయ వత్తిళ్లు, ముడి చమురు ధరల ప్రభావం కూడా దేశీయ మార్కెట్లపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే దేశీయంగా కార్పొరేట్ కంపెనీలు రెండవ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తుండటం కొంత మార్కెట్లను నడిపించటంలో దోహదపడుతోందన్నారు. అలాగే ఎఫ్ఐఐల పనితీరుపై అందరి దృష్టి ఉందన్నారు.

ఇదే క్రమంలో మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ పాల్కా అరోరా చోప్రా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, HSBC ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ PMI, సర్వీసెస్ PMI, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయం, US S&P గ్లోబల్ కాంపోజిట్ PMI, గ్లోబల్ సర్వీసెస్ PMI, ఇంగ్లాండ్ పీఎంఐ వంటికి కీలకమని ఆయన పేర్కొన్నారు. గత నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అత్యధికంగా రూ.90 వేల కోట్ల కంటే ఎక్కువ మెుత్తంలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటంతో మార్కెట్లలో కొంత కాలంగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. చైనా మార్కెట్లలో పెట్టుబడికి అవకాశాలు మెండుగా ఉండటంతో ప్రముఖ దేశీయ ఇన్వెస్టర్లు సైతం తమ పోర్ట్ ఫోలియోలో ఇండియన్స్ స్టాక్స్ ఆఫ్ లోడ్ చేస్తున్నట్లు ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే నవంబర్ నెలను దేశీయ స్టాక్ మార్కెట్లు శుభారంభంతో స్టార్ట్ చేశాయి. ఈ క్రమంలో నవంబర్ 1న దీపావళి సందర్భంగా నిర్వహించబడిన ఒక గంట ప్రత్యేక ట్రేడింగ్ ముహురత్ ట్రేడింగ్ సమయంలో లాభాలను చూశాయి. ఇది సంవత్ 2081కి నాంది పలికింది. రానున్న వారంలో అమెరికా ఎన్నికలతో పాటు ఫెడ్ పాలసీ సమావేశం గమనించదగిన కీలక అంశాలుగా రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఈ క్రమంలో డాక్టర్ రెడ్డీస్, టైటాన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా మరియు టాటా మోటార్స్‌తో సహా కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలపై మార్కెట్లో ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్న అంశంగా ఆయన పేర్కొన్నారు. అలాగే విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరాయంగా భారతీయ మార్కెట్లను నిష్కమించటం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications