Stock Market: వచ్చే వారం మార్కెట్లకు ఇవే కీలకం.. ఇన్వెస్టర్లు చూస్కోండి మరి..
Stock Market: గతవారం చివర్లో మార్కెట్లు భారీ ఒడుకులు బుల్ జోరుకు బ్రేకులు వేశాయి. అయితే ఇప్పుడు అందరిచూపు రానున్న వారంలో మార్కెట్లు ఎలా పనిచేయనున్నాయి, వాటిని ప్రభావితం చేసే అంశాలేమిటనే దానిపైనే ఉంది.
మిశ్రమ సూచనల మధ్య భారత సూచీలు వరుసగా రెండు వారాలుగా ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. అయితే బలమైన PMI గణాంకాలు, ఆటో అమ్మకాల్లో వరుస పెరుగుదల, బ్యాంక్ క్రెడిట్‌లో బలమైన విస్తరణ వంటి అనుకూలమైన అంశాలతో మార్కెట్లు సానుకూలంగానే ఉన్నాయని బ్రోకరేజ్ నిపుణులు చెబుతున్నారు. అయితే వచ్చే వారం మార్కెట్లలో గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.

రానున్న వారంలో ముందుగా అందరి చూపు జూన్ 14న జరగనున్న ఫెడ్ పాలసీ సమావేశాలు మార్కెట్లకు చాలా కీలకంగా మారనున్నాయి. ఇదే క్రమంలో వచ్చేవారం మాంద్యంలోకి జారుకున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, మరోపక్క జపాన్ సెంట్రల్ బ్యాంక్ తమ మానిటరీ పాలసీలపై చేసే ప్రకటనలు మార్కెట్లకు చాలా కీలకంగా మారాయి. ఇదే క్రమంలో ఐఐపీ డేటా, సీపీఐ ద్రవ్యోల్బణం, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. అలాగే రుతుపవనాల పురోగతికి సంబంధించిన వార్తలు మార్కెట్లకు చాలా కీలకం.
మార్కెట్లోని ఇన్వెస్టర్లు ప్రధానంగా మే నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం డేటా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటికి తోడు గతవారం జరిగిన రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశంలోని విషయాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇది పరిశ్రమలకు చాలా కీలకమైన విషయంగా ఉంది.


Click it and Unblock the Notifications