కొన్ని సంవత్సరాలుగా ఆఫీసుల్లో దీపావళి సంబరాలు చాలా మారాయి. ముందుగా, సాధారణంగా ఉద్యోగులకి చిన్న స్వీట్స్, చాక్లెట్స్ బాక్స్లు లేదా చిన్న గిఫ్ట్స్ మాత్రమే పొందేవారు. కానీ ఇప్పుడు, అనేక కంపెనీలు ఉద్యోగులను ప్రత్యేకంగా భావిస్తూ, ఖరీదైన గ్యాడ్జెట్స్, గిఫ్ట్ హాంపర్స్, ఇంటి కి ఉపయోగపడే వస్తువులు వంటి పెద్ద గిఫ్ట్స్ ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ, దీపావళి గిఫ్ట్స్ వీడియోలు మరియు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీని వల్ల, కార్పొరేట్ గిఫ్టింగ్ ఇప్పుడు పండుగలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ ఇటీవల ఒక కంపెనీ ఈ ట్రెండ్‌ను పూర్తిగా మార్చింది, అందరూ అశ్చర్యపోయేలా ఒక స్పెషల్ దీపావళి గిఫ్ట్స్ ఏర్పాటు చేసింది.

బ్యాంక్‌లు, IT కంపెనీలు మరియు ఇతర పెద్ద సంస్థలు ఈ దీపావళి సందర్భంగా ఉద్యోగులకు గిఫ్ట్స్ ఇచ్చి ఆనందాన్ని పంచుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన వీడియోలో ఉద్యోగులు సంప్రదాయ దుస్తుల్లో, గర్వంగా తమ గిఫ్ట్స్ ఒక ఎయిర్ ఫ్రైయర్ మరియు చిన్న బాక్స్ తో కనిపించారు. వీడియో క్యాప్షన్ ఇలా ఉంది - "మీకు ఇంకా 'సోన్ పాప్డీ'' వస్తున్నట్లయితే, రిజైన్ చేయండి". ఇది సోషల్ మీడియాలో పెద్ద హాస్య వ్యంగ్యాన్ని దారితీసింది.
వీడియో పై కామెంట్లు రావడం కూడా మొదలైంది. కొంతమంది "మా హెచ్‌ఆర్ ఇది AI అని చెప్పింది " అని రాసారు, మరికొందరు ""మీ కంపెనీలో హైరింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతోంది?" అని ప్రశ్నించారు. కొన్ని కామెంట్లు గిఫ్ట్స్ విలాసాన్ని సాధారణ దీపావళి సెలెబ్రేషన్స్‌తో పోల్చుతూ వ్యంగ్యంగా ఉన్నాయి.
ఒక యూజర్ ఇలా కామెంట్ చేశాడు "అయితే సోన్‌పప్డీ కూడా రాకపోతే ఏమి చేయాలి?" అని. మరో వ్యక్తి వ్యంగ్యంగా, "కొన్ని కంపెనీలు సోన్ పప్డీ అయినా ఇస్తాయని అనుకోవడం కూడా చాలా ధైర్యం!" అని రాశాడు. మరికొందరు వ్యంగ్య శైలిలో స్పందిస్తూ, "ఇలాంటి రీల్స్ చూసి 90% కార్పొరేట్ ఉద్యోగులు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు" అని కామెంట్ చేశారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా సరదాగా "బేర్ మినిమమ్ యార్" అంటూ తమ రియాక్షన్ ఇచ్చింది.
అలాగే, కొంతమంది చిన్న గిఫ్ట్ కూడా ఎంత పెద్ద ఆనందాన్ని ఇచ్చిందో గమనించారు. ఒక యూజర్ సరదాగా ఇలా రాశాడు, రూ. 4,000-రూ. 5,000 విలువైన VIP ట్రాలీల నుంచి రూ. 3,000 విలువైన అగారో ఎయిర్ ఫ్రయర్ల వరకు... ఈ 'మజ్దూర్' లు లాటరీ గెలిచినట్టే సెలబ్రేట్ చేస్తున్నారు! తమ జీతం 10% కంటే తక్కువ విలువ ఉన్న గిఫ్ట్‌కే ఇంత ఆనందం... ఇదే కదా 'చిన్న గిఫ్ట్ - పెద్ద ఎమోషన్' కి నిజమైన ఉదాహరణ!" అని కామెంట్ చేశారు.
ఇటీవల, Info Edge వంటి పెద్ద భారతీయ టెక్ కంపెనీలు కూడా దీపావళి గిఫ్టింగ్ విషయంలో వార్తల్లో నిలిచాయి. ఉద్యోగులు ఇన్‌స్టాగ్రామ్‌లో తమ గిఫ్ట్స్ VIP సూట్‌కేస్‌లు, బాక్స్‌లు, డెకోరేటివ్ దీపాలు ప్రదర్శిస్తూ, కంపెనీలు తమ ఉద్యోగులను ప్రత్యేకంగా భావించే ప్రయత్నం ఎంతగానో చేస్తున్నాయని చూపించాయి. బెంగళూరులోని ఆల్టియక్స్ ఇన్నోవేషన్స్ కంపెనీ ఉద్యోగులకు ట్రోలీ బ్యాగ్స్ ఇచ్చింది. అలాగే, గ్లోబల్ డేటా కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ట్రోలీ బ్యాగ్స్ గిఫ్ట్ చేసింది. Entune IT Services కంపెనీ కూడా దీపావళి సందర్భంగా ట్రోలీ బ్యాగ్స్ ద్వారా తన ఉద్యోగులను సంతోషపరుచింది. ఈ చిన్న గిఫ్ట్స్ కూడా ఉద్యోగులలో పెద్ద ఆనందాన్ని, ఆఫీసులో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
దీపావళి ఆఫీసు వేడుకలు ఇప్పుడు కేవలం స్వీట్స్ ఇవ్వడమే కాదు, ఉద్యోగులకి ఆనందాన్ని, మోటివేషన్‌ని ఇస్తూ, సోషల్ మీడియాలో చర్చకు, కొన్నిసార్లు హాస్యానికి కారణమవుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications