డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు మన జీవితంలో మరింత సులభతరం అవుతున్నాయి. UPIతో చిన్న ఖర్చులు మాత్రమే కాదు, బీమా, పెట్టుబడులు, రుణాలు, ట్రావెల్, బంగారం వంటి పెద్ద లావాదేవీలు కూడా చెయ్యగలుగుతున్నాం. గతంలో కొన్ని రంగాల్లో రోజువారీ పరిమితుల కారణంగా ఇబ్బందులు ఎదురైయేవి, ఇప్పుడు NPCI కొత్త నియమాలు తీసుకురావడం వలన ఈ లావాదేవీలు మరింత సులభం, వేగవంతంగా మారబోతున్నాయి.

సెప్టెంబర్ 15 అంటే ఈరోజు నుంచి, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) UPI లావాదేవీల పరిమితులను పెంచింది. దీని ద్వారా బీమా, పెట్టుబడులు, ట్రావెల్, రుణాలు, బంగారం వంటి రంగాల్లో పెద్ద మొత్తాల్లో చెల్లింపులు చేసుకోవడం సులభం అవుతుంది. అయితే, విభిన్న రంగాలకు రోజువారీ గరిష్ఠ పరిమితులు కొనసాగుతాయి, అందువల్ల ఆర్ధిక పరిమితులు పూర్తిగా తొలగలేదు.
వ్యక్తి నుండి వ్యాపారికి (P2M) లావాదేవీల కోసం రోజువారీ పరిమితి "రూ. 10 లక్షల" వరకు పెరిగింది. గతంలో తక్కువ పరిమితులు ఉండడం వల్ల కొన్ని రంగాల్లో చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి.
బీమా మరియు పెట్టుబడుల కోణంలో, కాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియమ్ చెల్లింపులు "రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల" వరకు పెరిగాయి. అలాగే, ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GEM) పోర్టల్‌లోని లావాదేవీల పరిమితి కూడా "రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల" వరకు పెరిగింది, ఇందులో ట్యాక్స్ చెల్లింపులు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్లు కూడా వస్తాయి.
ప్రయాణ రంగంలో ట్రావెల్ సంబంధిత లావాదేవీల పరిమితి "రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల" వరకు పెరిగినప్పటికీ, మొత్తం రోజువారీ గరిష్ఠ పరిమితి "రూ. 10 లక్షలు" మాత్రమే ఉంది. UPI ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడానికి ప్రతి లావాదేవీ రూ. 5 లక్షలు రోజువారీ పరిమితి రూ. 6 లక్షలుగా ఉంది. రుణ EMIలు కూడా ప్రతి లావాదేవీ రూ. 5 లక్షలు నుంచీ రోజువారీ రూ. 10 లక్షలు వరకు పెరిగాయి.
బంగారం కొనుగోలు పరిమితి కూడా పెరిగింది. UPI ద్వారా ప్రతి లావాదేవీకి రూ. 2 లక్షలు(మునుపటి రూ. 1 లక్ష) మరియు రోజువారీ రూ. 6 లక్షలు వరకు చెల్లించవచ్చు. అలాగే, డిజిటల్ ఆన్బోర్డింగ్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు చేసుకోవడానికి కూడా ప్రతి లావాదేవీ రూ. 5 లక్షలు పరిమితి ఉంచబడింది.
కానీ వ్యక్తి-నుండి-వ్యక్తికి (P2P) లావాదేవీల రోజువారీ పరిమితి మారలేదు. ఇది ఇంకా రూ. 1 లక్ష రోజువారీ పరిమితిగా కొనసాగుతోంది.
కొత్త UPI నియమాల వల్ల పెద్ద మొత్తాల్లో చెల్లింపులు చేయడం సులభం అవుతుంది, ముఖ్యంగా బీమా, పెట్టుబడులు, ట్రావెల్, రుణాలు, బంగారం వంటి రంగాల్లో. అయితే, వ్యక్తిగత P2P చెల్లింపుల పరిమితులు అలాగే ఉన్నాయి.
పెద్ద మొత్తాల్లో UPI ద్వారా లావాదేవీలు చేయడానికి చాలా సులభంగా మారినప్పటికీ, సేఫ్టీకి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పెద్ద చెల్లింపులు చేసే సమయంలో ఫ్రాడ్ రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే, UPI ద్వారా లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని సింపుల్ గల కానీ ముఖ్యం అయిన నియమాలు పాటించడం అవసరం.
ముందుగా, OTP ధృవీకరణ తప్పక చేసుకోవాలి. ప్రతి లావాదేవీకి వచ్చే OTP ని ఎవరితోనూ షేర్ చెయ్యకూడదు. అలాగే, లావాదేవీలు మాత్రమే అధీకృత యాప్‌ల ద్వారా చేయాలి, అంటే మీరు ఫ్రాడ్ ఆప్స్, అనధికారిక యాప్‌లు వాడకూడదు. అలాగే, లావాదేవీ పూర్తి అయిన తర్వాత డిజిటల్ రసీదు సేవ్ చేసుకోవడం చాలా అవసరం. ఇది భవిష్యత్ వివాదాలు లేదా చెల్లింపు నిర్ధారణ కోసం ఉపయోగపడుతుంది.
పెద్ద మొత్తాలు ఒకేసారి చాలా లావాదేవీలు చేయవద్దు, అంటే మితిమీరిన వినియోగాన్ని చేయకూడదు. అంతే కాకుండా, ప్రతి లావాదేవీ లాగ్ ని కూడా సేవ్ చేసుకోవడం, లేదా బ్యాంకు స్టేట్‌మెంట్‌లతో క్రాస్ చెక్ చేసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే, పెద్ద లావాదేవీలు సురక్షితంగా, సులభంగా జరుగుతాయి, మరియు ఆర్థిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications