ఒకప్పుడు పేదలకు ప్రాణాధారంగా నిలిచిన ఆరోగ్యశ్రీ, ఇప్పుడు మాత్రం తెలంగాణలో శ్వాస తీసుకోవడానికి కష్టపడుతోంది. ఎంతోమంది బతుకులను, కుటుంబాలను నిలబెట్టిన ఈ పథకం, ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో దాదాపు రూ. 1,400 కోట్ల బకాయిల బారిన పడింది. ఇక మాకేం తోచడం లేదంటూ తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) కూడా సెప్టెంబర్ 16 అర్థరాత్రి నుంచి సేవలను నిలిపేస్తున్నట్టు చెప్పేసింది. అంటే ఈరోజు నుంచే వేలాది రోగులకు ఆసుపత్రి ద్వారాలు మూసుకుపోయే పరిస్థితి ఏర్పడనుంది.

ఈ నిర్ణయాన్ని TANHA సోమవారం సెప్టెంబర్ 15 ప్రకటించింది. ఎన్నిసార్లు హామీలు ఇచ్చినా ప్రభుత్వం చెల్లింపులు క్లియర్ చేయకపోవడంతో, ఆసుపత్రుల వద్ద ఇక వేరే మార్గం లేకపోయిందని TANHA అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ తెలిపారు.
TANHA చెబుతున్న వివరాల ప్రకారం ఆరోగ్యశ్రీ, పథకం కింద రావాల్సిన రీయింబర్స్‌మెంట్లు సాధారణంగా 40 రోజుల్లో రావాలి. కానీ ఇప్పుడు అవి 350-400 రోజులు ఆలస్యమవుతున్నాయి. ఈ పథకం సజావుగా నడవాలంటే ప్రతి 40 రోజులకు కనీసం రూ. 100 నుంచి రూ. 150 కోట్లు కావాలి. కానీ దాదాపు సంవత్సరం రోజులుగా ఈ డబ్బులు రాకపోవడంతో చిన్న, మధ్యస్థ ఆసుపత్రులు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయాయి.
ఇంతవరకు పరిస్థితిని సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు కానీ, ఇక దాటలేని దశకు చేరుకున్నామంటున్నారు ఆసుపత్రులు. ఇప్పటికే TANHA పలుమార్లు సి. దామోదర్ రాజ నరసింహ (ఆరోగ్య శాఖ మంత్రి), ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ (AHCT) అధికారులతో మీటింగులు పెట్టుకున్నా ఎటువంటి స్పష్టమైన పరిష్కారం రాలేదని అంటున్నారు. అందుకే ఇక సేవల నిలిపివేత తప్ప వేరే మార్గం కనిపించడం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
ఈ సమ్మె వల్ల పెద్దగా దెబ్బ తినే అవకాశం ఉన్నవి. ముఖ్యంగా డయాలిసిస్, ఐసీయూ ట్రీట్మెంట్, అత్యవసర శస్త్రచికిత్సలు లాంటి సేవలకే ఇది పెద్ద షాక్ అవుతుంది. ఎందుకంటే ఈ సేవలను ఒక్క రోజు ఆగిపోతే రోగుల ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుతం TANHA పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా 350కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇందులో ఎక్కువగా చిన్న, మధ్యస్థ స్థాయి ఆసుపత్రులే ఉండటంతో ప్రభావం కూడా అదే స్థాయిలో తీవ్రంగా పడుతుంది.
గ్రామీణ జిల్లాలు, చిన్న పట్టణాల ఆసుపత్రుల్లో సుమారు 80-85% మంది రోగులు ఆరోగ్యశ్రీ, పథకం కిందే చికిత్స పొందుతున్నారు. అక్కడి ఆసుపత్రులు పూర్తిగా ఈ పథకం పైనే ఆధారపడి ఉంటాయి. కానీ హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో మాత్రం ఈ పథకంలో చికిత్స పొందేవారి శాతం 15-20% మాత్రమే ఉంటుంది, మిగతా రోగులు ఇన్సూరెన్స్ లేదా క్యాష్ ద్వారా చెల్లిస్తారు. అందుకే ఈ సమ్మె ప్రభావం నగరాల కంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా పడనుంది.
దీంతో చిన్న, మధ్యస్థ ఆసుపత్రులు పూర్తిగా ఆరొగ్యశ్రీ రీయింబర్స్‌మెంట్ల పైనే ఆధారపడటం వల్ల, ఈ బకాయిల భారంతో అవి కుదేలవుతున్నాయి అని TANHA చెబుతోంది.
ఈ ఏడాదిలోనే TANHA మరియు ప్రభుత్వానికి మధ్య ఇది రెండోసారి పెద్దగా తగువు దాకా వెళ్లింది. అంటే ఇంతకుముందు కూడా ఒకసారి బాగా ఘర్షణకు దారి తీసింది, ఇప్పుడు మళ్లీ పరిస్థితి అక్కడికే చేరిందన్న మాట.
ఇంతకుముందు కూడా ఒకసారి ప్రైవేట్ ఆసుపత్రులు 10 రోజుల పాటు సమ్మె చేపట్టాయి. తర్వాత ఆరోగ్య మంత్రితో జరిగిన చర్చల అనంతరం సేవలను తిరిగి ప్రారంభించారు. అలాగే ఆగస్టు మూడో వారం సమయంలో కూడా ఆగస్టు 31 నుంచే సేవలను నిలిపేస్తామంటూ హెచ్చరించారు అయితే ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన హామీతో సమ్మెను వాయిదా వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైపోవడంతో, ఇక వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టంగా ప్రకటించారు.
TANHA అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి పలు హామీలు వచ్చినా, చెల్లింపుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నారు. సెప్టెంబర్ 16 రాత్రి 11:59 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరొగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు. సేవల నిలిపివేతతో కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications