i
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

July 1st Changes: జూలై 1 నుంచి వస్తున్న మార్పులు ఇవే.. తప్పక తెలుసుకోండి..

|

July 1st Changes: జూలై 1 నుంచి అనేక మార్పులు రాబోతున్నాయి. వివిధ టాక్స్ నియమాలు, స్టాక్ మార్కెట్, కార్మిక చట్టాలకు సంబంధించిన మార్పులు ఈ రోజు నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ మార్పులు సామాన్యులతో పాటు ఇతరులను ప్రభావితం చేయనున్నాయి. ఈ క్రమంలో వస్తున్న అన్ని కీలక మార్పులు జరగబోతున్నాయో తప్పకుండా తెలుసుకోండి..

క్రిప్టో కరెన్సీలు అండ్ వర్చువల్ డిజిటల్ ఆస్తులపై టాక్స్:

క్రిప్టో కరెన్సీలు అండ్ వర్చువల్ డిజిటల్ ఆస్తులపై టాక్స్:

ఫిబ్రవరి 1న జరిగిన యూనియన్ బడ్జెట్ 2022-23లో వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) లేదా క్రిప్టోకరెన్సీలపై TDS వసూలు చేసేందుకు నిబంధన అమలులోకి రానుంది. వర్చువల్ ఆస్తులకు రూ. 10,000 కంటే ఎక్కువ చెల్లింపు కోసం ఒక శాతం TDS నిబంధన కూడా ఈ రోజు నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ లావాదేవీలపై 30 శాతం ఆదాయపు పన్నుతో పాటు ఏప్రిల్ 1 నుంచి సెస్ అండ్ సర్‌చార్జి వర్తిస్తుంది. ఇటీవల CBDT వర్చువల్ డిజిటల్ ఆస్తులు లేదా క్రిప్టోకరెన్సీలపై TDS ఎలా వసూలుపై ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.

పాన్-ఆధార్ లింక్:

పాన్-ఆధార్ లింక్:

మార్చి 29న జారీ చేసిన నోటిఫికేషన్‌లో CBDT పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి పొడిగించిన గడువు మార్చి 31, 2023 అని తెలిపింది. అయితే.. ఇంకా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారు పెనాల్టీతో లింక్ చేసుకోవలసి ఉంటుంది. పాత గడువులోపు లింక్ చేసుకోనివారికి జూన్ 30 వరకు రూ.500 జరిమానాతో పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కానీ.. జూలై 1, 2022 లేదా ఆ తర్వాత మీరు మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేస్తున్నట్లయితే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

TDS/TCS రూల్స్ మార్పులు:

TDS/TCS రూల్స్ మార్పులు:

ఈ నెల ప్రారంభంలో ఏదైనా వ్యాపారం లేదా వృత్తిలో వచ్చే లాభాలకు సంబంధించి కొత్త TDS నిబంధన అమలుకు సంబంధించి CBDT మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసింది. ఇందుకోసం బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 194ఆర్‌ను తీసుకొచ్చింది. ఒక సంవత్సరంలో రూ.20,000 కంటే ఎక్కువ ఏదైనా వ్యక్తి వ్యాపారం లేదా వృత్తిలో ఏదైనా లాభం లేదా ప్రోత్సాహాన్ని అందించే ప్రతి వ్యక్తికి 10 శాతం TDS మినహాయింపు ఇకపై తప్పనిసరి.

కొత్త కార్మిక చట్టాలు:

కొత్త కార్మిక చట్టాలు:

జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది అమలైతే ఉద్యోగుల పనిదినాలు తగ్గుతాయి. దీనితో పాటు టేక్ హోమ్ జీతం తగ్గుదల వంటి అనేక అంశాలు ఉన్నాయి. కొత్త లేబర్ కోడ్‌లు ఉద్యోగులకు వారంలో పని దినాల సంఖ్యను తగ్గించాలని ప్రతిపాదించాయి. ఈ విధంగా.. వారంలో పని దినాలను 5 నుంచి 4కి తగ్గించవచ్చు. అయితే.. ఇది రోజుకు పని గంటలను పెంచుతుంది. నిబంధన ప్రకారం వారంలో 48 గంటల పని చేయాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగులు 9 గంటల షిఫ్ట్‌లకు బదులుగా 12 గంటల షిఫ్టుల్లో పని చేస్తారు. ఇవే కాకుండా పీఎఫ్ పెంపు, ఎర్న్డ్ లీవ్ పాలసీ వంటి అనేక నిబంధనలు ఉన్నాయి.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై:

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై:

దేశ రాజధాని ఢిల్లీలో జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం అమలులోకి రానుంది. ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో ఇయర్‌బడ్‌లు, బెలూన్‌ల ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ జెండాలు, ఐస్‌క్రీం ప్లాస్టిక్ స్టిక్‌లు, థర్మాకోల్ అలంకరణ వస్తువులు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, స్ట్రాలు, ట్రేలు వంటివి ఉన్నాయి. క్యాన్లను ప్యాకింగ్ చేయడానికి, ఆహ్వాన కార్డులు, సిగరెట్ ప్యాకింగ్‌లో ఉపయోగించే ప్లాస్టిక్ 100 మైక్రాన్ల కంటే సన్నగా ఉండే PVC, ప్లాస్టిక్ బ్యానర్‌లు మొదలైనవి ఈ క్యాటగిరీలోకి వస్తాయి

డీమ్యాట్ ఖాతా:

డీమ్యాట్ ఖాతా:

ట్యాగ్ చేయని స్టాక్ బ్రోకర్ల డీమ్యాట్ ఖాతాలను జూన్ చివరి నాటికి ట్యాగ్ చేయాలని గత వారం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. జూలై 1 నుంచి ట్యాగ్ చేయకుండా సెక్యూరిటీలను డీమ్యాట్ ఖాతాలలో క్రెడిట్ చేయలేరు. అయితే కార్పొరేట్ వ్యవహారాల్లో క్రెడిట్ అనుమతించబడుతుందని సెబీ సర్క్యులర్‌లో పేర్కొంది. ఆగస్ట్ నుంచి ట్యాగ్ చేయకుండా మిగిలిపోయిన ఏ డీమ్యాట్ ఖాతా నుంచి సెక్యూరిటీలు డెబిట్ చేయబడవని సెబీ తెలిపింది.

వీటికి తోడు ఏసీలు, రెఫ్రిజరేటర్లు, టాటా మోటార్స్ కు చెందిన ప్యాసింజర్ కార్లు, స్టీల్, ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఇదే క్రమంలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది

Read more about: tds
English summary

from tds, tax on crypto to pan aadhaar link know about these changes coming into force from today

know about changes coming in to force from july 1st
Story first published: Friday, July 1, 2022, 10:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X