IT News: ఆర్థిక సంవత్సరం మెుదటి భాగంలో టెక్కీల నిరాశ.. 25 ఏళ్లలో తొలిసారిగా..
IT News: 2023 ఐటీ రంగంలో పెను మార్పులను సృష్టించింది. చాలా మంది కట్టుకున్న టెక్ కలలు వాస్తవ రూపం దాల్చలేదు. ప్రస్తుతం దేశంలో నాన్ టెక్నికల్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయని జాబ్ పోర్ట్స్ సమాచారం ప్రకారం తెలుస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరం మెుదటి అర్థభాగంలో దేశంలోని టాప్-10 టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల వివరాలను అందించాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వీటిలో రూ.21.1 లక్షల మంది మెుత్తం ఉద్యోగులు ఉండగా.. సెప్టెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 20.6 లక్షలకు క్షీణించింది. ఫలితంగా 51,744 మంది ఉద్యోగాలను కోల్పోయారు.

దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్‌టెక్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, ఎంఫాసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టిఐమిండ్‌ట్రీ కంపెనీలు 25 ఏళ్లలో మెుదటి సారిగా ఏకకాలంలో ఉద్యోగుల పతనాన్ని నమోదు చేసినట్లు స్టాటిస్ట డేటా వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మెుదటి అర్ధ భాగంలో కంపెనీల్లో ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్యలు తగ్గిన తర్వాత వాస్తవ సంఖ్యలను పరిశీలిస్తే.. TCS (6,06,985), విప్రో (2,44,707), టెక్ మహీంద్రా (1,50,604), LTIMindtree (85,532), కాగ్నిజెంట్ (3,45,600), ఇన్ఫోసిస్ (3,28,764), HCLTech (2,21,139), పెర్సిస్టెంట్ సిస్టమ్స్ (22,842), Mphasis (33,771) మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి.
అలాగే రెండవ త్రైమాసికంలో టాప్ టెక్ కంపెనీలు రానున్న త్రైమాసికాల్లో నియామకాలను తగ్గిస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇన్ఫోసిస్ సీఎఫఓ నిలంజన్ రాయ్ అయితే కంపెనీ క్యాంపస్ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. విప్రో ఇప్పటికే ఇచ్చిన ఆఫర్లను నిలుపుకునే ప్రయత్నంలో కొత్త ఆఫర్లను నిలిపివేసింది. ఇదే క్రమంలో ఫ్రెషర్లను నియమించుకుంటామని టీసీఎస్ ప్రకటించింది. అయితే ఐటీ రంగానికి డిమాండ్ వాతావరణం బలహీనంగా ఉందని కొత్తగా టీసీఎస్ సీఈవో కె. కృతివాసన్ వివరించారు.


Click it and Unblock the Notifications