IT News: మునిగిపోనున్న Infosys, TCS, Wipro..! దిగ్గజాల దిగాలు.. అసలు కారణం..
IT News: కరోనాను అందరూ ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నప్పటికీ.. ఐటీ ఉద్యోగులు మాత్రం ఇంకా ఆ కాలం నుంచి బయటకు రావటం లేదు. అప్పట్లో కంపెనీ అందించిన వర్క్ ఫ్రమ్‌హోమ్ వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. కావాలంటే జామ్ మానేస్తాం కానీ ఆఫీసులకు తిరిగి రాబోమని చాలా మంది అంటున్నారు.
దేశంలోని అతిపెద్ద వైట్ కాలర్ యజమానులు, ఐటీ సేవల దిగ్గజాలు దీనిని మార్చేందుకు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే ట్రెండ్‌లో ముందున్నాయి. 2021-22 తారాస్థాయి నుంచి అనుసరించి జాబ్ మార్కెట్ ప్రస్తుతం కూల్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఉద్యోగులు తప్పకుండా ఆఫీసులకు తిరిగి రావాల్సిందేనని కంపెనీలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన ఉద్యోగులను వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. తాజాగా ఉద్యోగులను ట్రాన్ఫర్ చేయటం కూడా పెద్ద వివాదంగా మారింది.

ఆఫీసులకు రమ్మనటం గురించి టీసీఎస్ తొలుత ప్రకటించగానే చాలా మంది మహిళా ఉద్యోగులు కంపెనీని వీడటం మనం గమనించాం. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా FY23లో జాబ్స్ టీసీఎస్ లో వదిలేయగా.. కంపెనీ మాత్రం ముందుకే కొనసాగింది. గడచిన రెండేళ్లుగా సహకారం, మెంటర్‌షిప్, టీమ్-బిల్డింగ్ వంటి ముఖ్యమైన అంశాలు చాలా దెబ్బతిన్నాయని సంస్థ CHRO మిలింద్ లక్కడ్ తెలిపారు.
ఇక ఇతర టెక్ దిగ్గజాల తీరును గమనిస్తే.. నవంబర్ 20 నుంచి ప్రారంభ, మధ్య స్థాయి ఉద్యోగులు కనీసం నెలలో 10 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని ఇన్ఫోసిస్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే వారంలో మూడు రోజులు కార్యాలయానికి రావాలని.. బెంగళూరుకు చెందిన విప్రో, నోయిడాకు చెందిన హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగులను తెలిపాయి. అలాగే క్యాప్ జెమినీ, LTIMindtree వంటి కంపెనీలు కూడా ఇదే దారిని ఎంచుకున్నాయి.
తాజాగా CIEL HR సర్వీసెస్ సర్వే ప్రకారం.. 10 మంది ఉద్యోగుల్లో నలుగురు ఆఫీసులో కానీ హైబ్రిడ్ ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మహిళా ఉద్యోగుల విషయానికి వస్తే ప్రతి పదిమందిలో 5 మంది ఇప్పటికీ రిమోట్ వర్క్‌ను ఫ్లెక్సిబిలిటీతో ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించటం కంపెనీలకు పెద్ద సవాలుగా మారుతోందని నివేదిక పేర్కొంది. కంపెనీల్లోని అట్రిషన్ రేటు దీనిని ప్రతిబింబిస్తోంది. వ్యాపారాలను సాఫీగా కొనసాగించేందుకు వీటికి కంపెనీలే మంచి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు సైతం స్లో పాయిజన్ గా మారిన వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానానికి విరుగుడును క్రమంగా అవలంభిస్తాయని వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications